హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పట్టణ పునర్జీవనం, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా చేపట్టిన అమృత్ 2.0 ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.2025–-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కింద ఖర్చు చేసేందుకు రూ.573 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
