గిరిజన రిజర్వేషన్లపై జీవో ఏది ?

గిరిజన రిజర్వేషన్లపై జీవో ఏది ?

హైదరాబాద్, వెలుగు: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధుపై సర్కార్ సప్పుడు చేయడం లేదు. ఈ నెల 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, వారంలోనే రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ సీఎం ప్రకటించి పది రోజులైనా జీవో రాలేదు. రాష్ట్రంలో గిరిజనుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని 33 గిరిజన తెగలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. 

రిజర్వేషన్లు పెంచకపోవడంతో గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆం దోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పటి దాకా 10 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, కనీసం ఎకరం కూడా పంపిణీ చేయలేదు. పైగా పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ, బంజారా రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారు.  

అధ్యయనానికే పరిమితం.. 

రాష్ట్ర ప్రభుత్వం  2017 ఏప్రిల్​16న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఎస్టీ రిజర్వేషన్ బిల్లులో అనేక లోపాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో కేంద్రం ఆమోదముద్ర వేయకపోవడంతో ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసిన చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల పెంపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. గిరిజన ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులతో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న గిరిజన రిజర్వేషన్ల విధానాలను కూడా అధ్యయనం చేశారు. కానీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదు. 

రాష్ట్రం పెంచే అవకాశమున్నా కేంద్రంపై నిందలు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌16(4) ప్రకారం ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్ల శాతం పెంచే వెసులుబాటు ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లు కేంద్రంపై నింద వేసి, రిజర్వేషన్ల పెంపును వాయిదా వేస్తూ వస్తోంది.  రాష్ట్రంలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్ల అమలుకు లేని ఆటంకం గిరిజనుల విషయంలో ఎందుకు ఉంటుందని గిరిజన సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 127 జీవో ప్రకారం 4 శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతానికి పెంచారని గుర్తు చేశారు. 

గిరిజన బంధుపై గైడ్ లైన్స్ ఇయ్యలే..  

ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలోనే దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే భూమి లేని నిరుపేద గిరిజనులకు మాత్రమే ఈ స్కీమ్ ను వర్తింపజేస్తామని సీఎం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దళిత బంధు స్కీమ్ ను నిరుపేద దళితులతో పాటు భూములు,  ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కుటుంబాలకు కూడా వర్తింపజేస్తున్న ప్రభుత్వం.. గిరిజన బంధు విషయంలో మాత్రం ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టాలనుకుంటోందని గిరిజన సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గైడ్ లైన్స్ విడుదల చేసి దళిత కుటుంబాలన్నింటికీ ఇచ్చినట్లుగానే గిరిజన కుటుంబాలన్నింటికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ముందు పోడు భూములకు పట్టాలివ్వండి.. 

సీమాంధ్ర పాలకులు తెలంగాణను దోపిడీ చేస్తే.. తెలంగాణ పాలకులు ఆదివాసీలను దోపిడీ చేస్తున్నారు. ఆదివాసేతరులు ఏజెన్సీ ఏరియాలోని ఇసుకను, నీళ్లను తరలించుకుపోతున్నారు. తెలంగాణ వచ్చాక గుంట భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం.. పోడు దరఖాస్తుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి. అలాగే భూమి లేనోళ్లకే గిరిజన బంధు ఇస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించడం సరికాదు. 10 గుంటలు, 20 గుంటలు ఉన్నోళ్లను కూడా భూమి ఉన్నోళ్లుగా చూపి గిరిజన బంధు నిరాకరించే ప్రమాదముంది. దళిత బంధులాగే గిరిజన బంధును ఆదివాసీ కుటుంబాలన్నింటికీ వర్తింపజేయాలి.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- వట్టం ఉపేందర్, రాష్ట్ర  అధ్యక్షుడు, తుడుందెబ్బ