
తమిళ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆమె తమిళ్ లో ట్వీట్ చేశారు. విజయకాంత్ మృతి చెందారనే వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. మంచి ఫిల్మ్ మేకర్...మంచి రాజకీయ నాయకుడు...మంచి మనిషి... మంచి అన్నయ్య...మొత్తానికి మనం ఒక మంచి మనిషిని కోల్పోయాం. సోదరుడు విజయకాంత్ కుటుంబానికి, ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అని తమిళిసై సంతాపం తెలిపారు.
உடல் நலக்குறைவால் மருத்துவமனையில் சிகிச்சை பெற்று வந்த தேமுதிக தலைவர்,சகோதரர் கேப்டன் திரு.விஜயகாந்த் அவர்கள் உயிரிழந்த செய்தியறிந்து மிகவும் மனவேதனை அடைந்தேன்.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 28, 2023
நல்ல திரைப்படக்கலைஞர்....
நல்ல அரசியல் தலைவர்....
நல்ல மனிதர்....
நல்ல சகோதரர்....
ஒட்டுமொத்தமாக ஒரு நல்லவரை நாம்… pic.twitter.com/oPVTWZ1uRD
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయకాంత్.. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 డిసెంబర్ 28 ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ వయస్సు 71 ఏళ్లు.. నాలుగేళ్ల క్రితం పక్షవాతం రావటంతో మంచానికే పరిమితం అయ్యారు. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. విజయకాంత్ మృతి పట్ల తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.