
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ శాఖలో 165 కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. ఇందులో మేనేజర్లు లేదా రెవెన్యూ ఆఫీసర్లు 38, సీనియర్ అసిస్టెంట్లు 17, జూనియర్ అసిస్టెంట్లు 37, వార్డ్ ఆఫీసర్లు 55 పోస్టులున్నాయి.
పంచాయతీ రాజ్ లో తొలగించిన పోస్టుల్లో గ్రేడ్ 1,2,3,4 పోస్టులు సుమారు 140 ఉన్నాయి. అలాగే.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్)కు టెక్నికల్ అడ్వైజర్ గా సత్యనారాయణను నియమిస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబర్తీ శనివారం జీవో జారీ చేశారు.