విచారణకు హాజరు కావాల్సిందే.. డింపుల్ కు షాకిచ్చిన హైకోర్ట్

విచారణకు హాజరు కావాల్సిందే.. డింపుల్ కు షాకిచ్చిన హైకోర్ట్

టాలీవుడ్ నటి డింపుల్ హయాతి(Dimple Hayathi)కి తెలంగాణ హైకోర్ట్(Telangana high court) షాకిచ్చింది. పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్న ఆరోపణలు  ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెను, న్యాయవాది డేవిడ్‌ ను పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వారిద్దరికీ సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 

మే 17న జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ దాఖలలైన పిటిషన్‌ను జస్టిస్‌ జి. అనుపమ చక్రవర్తి జూన్ 7 బుధవారం రోజున విచారించారు. ఇద్దరి తరపు న్యాయవాదుల వాదనల అనంతరం.. డింపుల్ ఖచ్చితంగా కోర్టు ఇంకా పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇక ఇదే విషయంపై మాట్లాడిన న్యాయవాది పాల్ సత్యనాధన్ డేవిడ్.. “ఇందులో పోలీసుల అత్యుత్సాహం తప్ప మరొకటి లేదని, వారి దౌర్జన్యాలను ప్రశ్నించకపోతే దానికి అంతం ఉండదని" ఆయన అన్నారు.