కుంటాల మండల కేంద్రంలో ఆకట్టుకున్న అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

 కుంటాల మండల కేంద్రంలో ఆకట్టుకున్న అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో శుక్రవారం మ హాదేవుని జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు అద్యంతం ఆకట్టుకున్నాయి. తెలంగాణ, ఆంధ్ర తో పాటు మహారాష్ట్ర, హర్యానా, చత్తీస్ ఘడ్ నుండి దంగల్ మల్లయోధులు పోటీల్లో తలపడ్డారు..ఫైనల్లో  మాధవ్ జవూర్ పై మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా బిద్రా లికి చెందిన సాయినాథ్ విజేతగా నిలిచాడు. 

ఫైనల్ విజేతను సర్పంచ్ జక్కుల గజేందర్, నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఎస్ ఐ అశోక్ ఆధ్వ ర్యం లో పోలీస్ లు బందోబస్తు ఏర్పాటు చేశారు.జడ్పీ మాజీ చెర్మన్ జుట్టు అశోక్, మాజీ మంత్రి  అల్లోల పీఏ నాలం శ్రీనివాస్,  ఉప సర్పంచ్ రమణ, నాయకులు జీవీ రమణ రావు,లక్ష్మణ్, గజ్జరాం, మహేందర్​ పాల్గొన్నారు.