హైదరాబాద్ హైటెక్స్ లో.. ఫుడ్ ఎ ఫెయిర్ షురూ

హైదరాబాద్ హైటెక్స్ లో.. ఫుడ్ ఎ ఫెయిర్ షురూ

హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ఫుడ్​, డ్రింక్స్​ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న 'ఫుడ్​ ఎ’ఫెయిర్​ 2025' రెండో ఎడిషన్​ హైదరాబాద్​లోని హైటెక్స్​లో ప్రారంభమైంది. ఈ ఫెయిర్​ నవంబర్​ ఆదివారమూ కొనసాగుతుంది. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

రిటైలర్లు, టెక్నాలజీ ఇన్నోవేటర్లు, చెఫ్‌‌‌‌లు, వివిధ పారిశ్రామిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఫెయిర్​ లక్ష్యం. ఈ సంవత్సరం కొత్తగా 'ఫుడ్​ ఎ’ఫెయిర్​ కలినరీ  కార్నర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న చెఫ్‌‌‌‌లు లైవ్​  డెమోలు, టేస్టింగ్ ​సెషన్‌‌‌‌లను నిర్వహిస్తున్నారు. ఆహార పరిశ్రమలలో ఆవిష్కరణ, మార్కెట్​ యాక్సెస్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ ఫెయిర్​ కృషి చేస్తుంది.  

తెలంగాణ ప్రభుత్వం ఫుడ్​ ప్రాసెసింగ్​, టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించి, రాష్ట్రానికి లీడింగ్​ హబ్​గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు.