పేకాట ఆడుతూ పట్టుపడిన మంత్రి సోదరుడు

V6 Velugu Posted on Jun 16, 2021

  • సికింద్రాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
  • పేకాట ఆడుతూ పట్టుపడిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి
  • 11 మంది అరెస్ట్.. 1.40 లక్షలు స్వాధీనం
  • బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ కు తరలింపు

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తున్న మంత్రి మల్లారెడ్డి పేరు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈసారి ఆయన సోదరుడి వల్లే ఆయనకు తలనొప్పి చుట్టుకుంది. మంత్రి మల్లారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి మరో 11 మందితో  పేకాట ఆడుతూ పట్టుపడడం కలకలం రేపుతోంది. 
సికింద్రాబాద్ పరిధిలో టాస్క్ ఫోర్సు పోలీసులు దాడులు చేయగా ఓ ప్రాంతంలో పేకాట శిబిరం పట్టుపడింది. ఈ శిబిరంలో స్వయంగా మంత్రి మల్లారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి ఉండడం పోలీసు డిపార్టుమెంట్ ను ఒత్తిడికి గురిచేసింది. పట్టుపడిన 11 మంది నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ కు అప్పగించారు. నిందితుల వద్ద 1.40 లక్షల నగదు దొరికినట్లు సమాచారం. 

Tagged Telangana today, , secudnerabad today, minister mallareddy brother, narasimhareddy arrest, playing cards gambling case, taskforce police raids

Latest Videos

Subscribe Now

More News