రేపు తెరచుకోనున్న పాస్ పోర్టు కేంద్రాలు

రేపు తెరచుకోనున్న పాస్ పోర్టు కేంద్రాలు

హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో మూతపడిపోయిన  పాస్ పోర్టు కేంద్రాలు రేపట్నుంచి యధావిధిగా పునః ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 హెడ్ పోస్టాఫీసులతోపాటు, ఐదు ప్రధాన పాస్ పోర్టు ఆఫీసులు యధావిధిగా పనిచేయనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు పగటిపూట ఎత్తేసిన విషయం తెలిసిందే. దీంతో పాస్ పోర్టు కేంద్రాలు రేపట్నుంచి యధావిధిగా పనిచేస్తాయని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. 
హైదరాబాద్ నగరంలోని బేగంపేట్, అమీర్ పేట్, టోలీ చౌకీ, నిజామాబాద్, కరీంనగర్ లలో జూన్ 1 నుంచి సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అత్యవసరంగా విదేశాలకు వెళ్లే వారి కోసం సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసి సేవలు కొనసించారు. అయితే ఇప్పుడు పగటిపూట ఆంక్షలు సడలించడంతో  వరంగల్, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్,మహమూబ్ నగర్, వనపర్తి, సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లా, మంచిర్యాల, మహబూబాబాద్, కామారెడ్డి, వికారాబాద్ లలో ఉన్న హెడ్ పోస్టాఫీసుల్లో పాస్ పోర్టు సేవలు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి.