
హైదరాబాద్, వెలుగు: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు మెడల్స్ మోత మోగిస్తున్నారు. విమెన్స్ జిమ్నాస్టిక్స్‌లో నిషిక అగర్వాల్ గోల్డ్ సహా మూడు మెడల్స్ నెగ్గగా, టెన్నిస్‌లో బసిరెడ్డి రిషితారెడ్డి గోల్డ్, సిల్వర్ గెలిచింది. లక్ష్మి సిరికి కాంస్యం లభించింది. బుధవారం జరిగిన జిమ్నాస్టిక్స్ వాల్టింగ్ టేబుల్ ఈవెంట్‌లో నిషిక 12.33పాయింట్లతో టాప్ ప్లేస్‌తో గోల్డ్ ఖాతాలో వేసుకుంది.
అన్‌ఈవెన్ బార్స్‌లో 9.700 స్కోరుతో మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకోగా, బాలెన్సింగ్ బీమ్‌లో 10.600 స్కోరుతో మరో కాంస్యం సాధించింది. ఇప్పటికే ఆల్‌రౌండ్ ఈవెంట్‌లో గోల్డ్ గెలిచిన నిషికకు ఇది నాలుగో పతకం కావడం విశేషం. టెన్నిస్ విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో రిషితారెడ్డి 6–-1, 2–-6, 6-–3తో మహారాష్ట్ర ప్లేయర్ ఐశ్వర్య జాదవ్ వరుససెట్లలో గెలిచి గోల్డ్ నెగ్గింది. అనంతరం డబుల్స్‌లో లక్ష్మి సిరితో కలిసి కలిసి రజతం కైవసం చేసుకుంది. విమెన్స్ ఫెన్సింగ్‌లో హురెన్ అదీబా కాంస్యం సాధించింది.