భారత్ టెక్స్​లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ స్టాల్

భారత్ టెక్స్​లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ స్టాల్

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేసిన ‘భారత్ టెక్స్’ లో తెలంగాణ స్టాల్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఈ నెల 26 నుంచి 29 వరకు దేశంలోని వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టెక్స్ –2024’ ని నిర్వహిస్తోంది. ఈ ఎగ్జిబిషన్ ను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలో తయారయ్యే అన్ని వస్త్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఫస్ట్ ఫ్లోర్ లోని 14వ హాల్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేసింది. 

రాష్ట్రంలో తయారయ్యే నారాయణ పేట్, పోచంపల్లి ఇక్కత్​తో పాటు ఇతర రకాల వస్త్రాలను ప్రదర్శిస్తోంది. టెక్స్ టైల్ రంగ అభివృద్ధికి కృషి చేస్తోన్న తీరును ఇక్కడ వివరిస్తోంది. కాగా, తెలంగాణకు చెందిన సిరిసిల్ల చేనేత కళాకారుడు యెల్ది హరి ప్రసాద్​కు ఈ ఎగ్జిబిషన్​లో పాల్గొనాలని కేంద్రం ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపింది.