
హైదరాబాద్, వెలుగు: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.375 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శనివారం మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం మొత్తం రూ.1500 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్ నుంచి రూ.375 కోట్లను రెండో క్వార్టర్నిధులుగా విడుదల చేసింది.
ఈ నిధులను ముసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు కోసం వినియోగించనున్నారు. నిధుల కోసం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ గత నెలలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రాజెక్ట్ అమలు కోసం రెండో క్వార్టర్ నిధులను విడుదల చేయాలని ఆ లేఖలో అభ్యర్థించారు. ఇక ఇప్పటికే మూసీ పునరుజ్జీవం కోసం రూ.4100 కోట్లు ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆమోదం తెలిపింది.