నల్గొండ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన హెచ్ఆర్సీ చైర్మన్

నల్గొండ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన హెచ్ఆర్సీ చైర్మన్

నల్గొండ జిల్లా :  వివాదాలకు నిలయంగా మారిన నల్గొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను ఆయన తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబరు 16 న అఖిల అనే గర్భిణి మృతిచెందింది. నల్గొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోని పలువురు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సకాలంలో తగిన చికిత్స అందక అఖిల మృతిచెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు అప్పట్లో ఆందోళనకు దిగారు.

ఈ ఘటనపై అప్పట్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య ఆస్పత్రిని తనిఖీ చేశారు.  అంతకుముందు జి.చంద్రయ్యకు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో  పుష్పగుచ్ఛం అందించి కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, డిస్ట్రిక్ట్  ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి బి.ఎస్. జగ్జీవన్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు.