ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి
  • స్పీకర్‌‌‌‌‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

నిజామాబాద్‌‌‌‌/వర్ని/బీర్కూర్‌‌‌‌, వెలుగు:  రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిందని స్పీకర్‌‌‌‌‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని, పాత బాన్సువాడ, బీర్కూర్‌‌‌‌ మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి  దిగుబడిలో బాన్సువాడ నియోజకవర్గం స్టేట్‌‌‌‌లో మొదటి స్థానంలో ఉందన్నారు.

తెలంగాణా వచ్చే నాటికి రాష్ట్రంలో అన్ని రకాల పంటల దిగుబడులు 1.10 కోట్ల టన్నులు ఉంటే నేడు మూడు కోట్ల టన్నులకు చేరుకుందని తెలిపారు. ఇందులో 1.50 కోట్ల టన్నుల మేర వరి ధాన్యం పండిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వానాకాలంలో రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం 7 వేల కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్‌‌‌‌ వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లాలో 458, కామారెడ్డి జిల్లాలో 349 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ యేడాది నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, యాసంగి పంటకు ఎలాంటి ఇబ్బందులు ఉండయన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ జితేష్‌‌‌‌ వి ‌‌‌‌పాటిల్‌‌‌‌‌‌‌‌, బోధన్‌‌‌‌ ఆర్డీవో రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌, వర్ని జడ్పీపీటీసీ హరిదాసు, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి పాల్గొన్నారు. బీర్కూర్‌‌‌‌లో జరిగిన ప్రోగ్రామ్‌‌‌‌లో ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, మాజీ ఎఎంసీ చైర్మన్​ద్రోణవల్లి అశోక్​, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఆవారి గంగారాం, సోసైటీ చైర్మన్, విండో డైరెక్టర్లు, లీడర్లు పాల్గొన్నారు.

అర్హులందరికీ సొంత ఇల్లు..

నస్రుల్లాబాద్, వెలుగు: నియోజకవర్గంలోని అర్హులందరికీ సీఎం కేసీఆర్ సహకారంతో సొంత ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. శనివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో షాదీ ఖానా భవనం పనులు ప్రారంభించడంతో పాటు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వచ్చిన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యదికంగా బాన్సువాడ నియోజకవర్గానికే డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసుకున్నామన్నారు. కులం, మతం, పార్టీకి సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.  కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, విండో చైర్మన్లు గంగారాం, సుధీర్, మారుతి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మహేశ్‌‌‌‌, మండల కోఆప్షన్ సభ్యులు మజీద్, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సీనియర్ లీడర్లు ఏడే మోహన్, లక్ష్మీనారాయణగౌడ్, పురం వెంకట్ పాల్గొన్నారు. 

స్టూడెంట్లు కష్టపడి చదవాలి

కామారెడ్డి, వెలుగు: స్టూడెంట్లు కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విద్యావర్ధిని అన్నారు. శనివారం  కామారెడ్డి ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌కే కాలేజీలో జరిగిన ప్రోగ్రామ్‌‌‌‌లో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలు స్టూడెంట్లకు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని  ఉపయోగించుకుని బాగా చదవాలన్నారు.

ఇటీవల సెకండ్ సెమిస్టర్‌‌‌‌‌‌‌‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన స్టూడెంట్లను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో కాలేజీ సీఈవో ఎం.జైపాల్‌‌‌‌రెడ్డి, ప్రిన్సిపాల్ ఎ.దత్తాత్రి, వైస్​ప్రిన్సిపాల్స్ మధుసూదన్‌‌‌‌రెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రతినిధులు సందీప్, బాల్‌‌‌‌రెడ్డి, దత్తుకుమార్ పాల్గొన్నారు.  

మున్సిపల్ సర్వసభ్య సమావేశం

బోధన్, వెలుగు: బోధన్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ తూము పద్మావతి అధ్యక్షత జరిగింది. శనివారం జరిగిన ఈ మీటింగ్‌లో 14 ఏజెండా అంశాలు ప్రవేశపెట్టగా వాటికి కౌన్సిల్​సభ్యులు ఆమోదం తెలిపారు. అందులో పట్టణ ప్రగతి ఫండ్స్​ రూ.5 లక్షలు, 15వ ఫైన్సాన్ ఫండ్స్​రూ.5 లక్షలకు అమోదం తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌‌‌‌ ఏతేషాం సోహెల్, మున్సిపల్ కమిషనర్ రామలింగం, డీఈ శివానందం పాల్గొన్నారు.

చెక్కుల పంపిణీ

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: వివిధ కారణాలతో మరణించిన పోలీసు అమరుల కుటుంబాలకు శనివారం సీపీ నాగరాజు ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు కుటుంబాలు కలిపి సుమారు రూ.20 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి రామారావు, శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ముఖిద్ భాషా, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, భద్రత సెక్షన్ ఇన్‌‌‌‌చార్జి రాజేశ్వర్ పాల్గొన్నారు.

బైక్ దొంగ అరెస్ట్​

భిక్కనూరు, వెలుగు:  పలు ప్రాంతాల్లో బైక్‌‌‌‌లు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని భిక్కనూరు పోలీసులు పట్టుకుని రిమాండ్‌‌‌‌కు తరలించారు. శనివారం సీఐ తిరుపయ్య వివరాలు వెల్లడించారు. స్థానిక టోల్​గేట్​ వద్ద శనివారం వెహికల్ చెక్​చేస్తుండగా మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన పూల్లూరి మల్లేశం అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకుని విచరించగా దొంగతనం విషయం బయటకొచ్చినట్లు తెలిపారు. మల్లేశం నుంచి గత కొద్ది రోజుల కింద కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇతర చోట్ల చోరీ చేసిన మూడు బైక్‌‌‌‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్సైలు హైమద్, గాంధీగౌడ్, ఏఎస్సై జగదీశ్వర్ పాల్గొన్నారు. 

పిట్లంలో సామాజిక తనిఖీ

పిట్లం, వెలుగు: పిట్లం మండలంలో 2019 నుంచి 2022 జరిగిన ఉపాధి హామీ పథకంపై శనివారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఎంపీపీ కవిత అధ్యక్షతన గ్రామాల వారీగా మూడేళ్లకు సంబంధించిన పనుల వివరాలు, వ్యయంపై తనిఖీ బృందం డీఆర్పీలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల్లో చాల చోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు.

రాంపూర్, తిమ్మానగర్, ధర్మారంలో ఆశవర్కర్ల పేరున హాజరు వేసి నిధులు దుర్వినియోగం అయినట్లు వివరించారు. రాంపూర్‌‌‌‌‌‌‌‌లో రూ.3.6 లక్షల నిధుల రికార్డులు, తిమ్మానగర్‌‌‌‌‌‌‌‌లో రూ. 43 లక్షల రికార్డులు ఇవ్వలేదని, వైకుంఠధామాల పనులు సరిగా చేయకున్నా ఎంబీ చేసినట్లు డీఆర్పీలు తెలిపారు. కొన్ని గ్రామాల్లో హైదరాబాద్​లోఉన్న వ్యక్తుల పేరున హాజరు వేసి నిధులు కాజేసినట్లు గుర్తించారు.

చాల పనుల్లో అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్డీవో సాయన్న, ఫైనాన్సియల్ మేనేజర్ రాంనారాయణరావు, జడ్పీటీసీ శ్రీనివాస్​రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీవో బ్రహ్మం, రైతు సమన్వయ సమితి ప్రెసిడెంట్ దేవెందర్​రెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు. 

జోనల్ స్థాయిలో సత్తా చాటిన స్టూడెంట్లు

నస్రుల్లాబాద్, వెలుగు: జోనల్​స్థాయి క్రీడల్లో తమ స్కూల్ స్టూడెంట్లు ప్రతిభ చాటినట్లు నస్రుల్లాబాద్​ గిరిజన గురుకులం ప్రిన్సిపాల్‌‌‌‌ వెంకటనారాయణ చెప్పారు. పోటీల్లో 9 పతకాలు సాధించిన స్టూడెంట్లను శనివారం  ప్రిన్సిపాల్‌‌‌‌, టీచర్లు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని గురుకులాల జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో తమ స్టూడెంట్లు సత్తా చాటారని చెప్పారు.

అండర్ 19 విభాగం ఫుట్​బాల్‌‌‌‌లో మొదటి స్థానం, అండర్ 17 రగ్బీలో ద్వితీయ, అండర్​17 టెన్నికాయిట్‌‌‌‌లో ద్వితీయ, అండర్ 14 వాలీబాల్‌‌‌‌లో ద్వితీయ, అండర్ 19 వాలీబాల్‌‌‌‌లో ద్వితీయ, అండర్​17 ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌లో ద్వితీయ స్థానంలో నిలిచారని వివరించారు. కార్యక్రమంలో పీఈటీలు అశ్విన్, జైతారాం, టీచర్స్​  బృందం పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ 22 గేట్లు ఓపెన్

నిజామాబాద్,  వెలుగు: ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరుగుతుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ‌‌‌‌భారీ ఇన్ ఫ్లో ఉండడంతో శనివారం ప్రాజెక్ట్‌‌‌‌ 22 గేట్లను ఓపెన్‌‌‌‌చేసి నీటిని కిందకు వదిలారు. ప్రాజెక్ట్‌‌‌‌లోకి 1,27,012 క్యూసెక్కుల ఇన్ ఫ్లోగా వస్తుండగా 1,18,560 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు.

మునుగోడులో బీజేపీదే విజయం

ఆర్మూర్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆర్మూర్ బీజేపీ నేత ప్రొద్దుటూరి వినయ్‌‌‌‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ బీజేపీ నాయకులతో కలిసి శనివారం ఆయన మునుగోడులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రాజెక్ట్‌‌‌‌ల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసి టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఈ ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపడుతున్న పథకాలను గడపగడపకు వివరించి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డిని భారీ మెజానర్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ లీడర్లు సైదులు, మల్లె నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీనివాస్, చైతన్యరెడ్డి పాల్గొన్నారు. 

పోడు భూములపై సర్వే 

ఇందల్వాయి, వెలుగు: ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో పోడు భూముల గుర్తింపు కోసం శనివారం ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేపట్టారు. సర్వే నంబర్ ఆధారంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లికేషన్ పెట్టుకున్న వారి భూములను పరిశీలించారు. పొజిషన్‌‌‌‌కు సంబంధించిన వివరాల కోసం దరఖాస్తుదారులు, సాక్షులను విచారించారు. ఇందల్వాయి గ్రామంలోని సర్వే నంబర్​ 1107, 1181 లో 25 మంది దరఖాస్తుదారుల నుంచి వివరాలు సేకరించామని రిపోర్ట్‌‌‌‌ను ప్రభుత్వానికి పంపిస్తామని ఆఫీసర్లు చెప్పారు. 

బైక్‌‌‌‌ను అడ్డగించి చోరీ

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి శ్రీరాంనగర్ కాలనీలో స్ర్కూటీపై వెళ్తున్న వ్యక్తిని అటకాయించి రూ.లక్ష నగదు చోరీ చేశారని టౌన్​సీఐ నరేశ్‌‌‌‌ తెలిపారు. ఆశోక్ నగర్​కాలనీ రైల్వే గేట్ సమీపంలో నివసించే గొజే సుధాకర్ శుక్రవారం కొత్త బస్టాండ్‌‌‌‌ నుంచి స్కూటీపై తన ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌‌‌‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మార్గ మధ్యంలో సుధాకర్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌కు అడ్డుగా వచ్చారన్నారు. బెదిరించి తన వద్ద ఉన్న రూ.లక్ష నగదును ఎత్తుకుని పారిపోయినట్లు సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పోలీసుల అదుపులో చైన్ స్నాచర్లు​

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం ఓ హహిళ మెడల్ నుంచి బంగారం గొలుసు లాక్కుపోయేందుకు ప్రయత్నించిన చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బతుకమ్మ కుంట ఏరియాలో నుంచి నడ్చుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి వెనుక నుంచి బైక్‌‌‌‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు చైన్​  స్నాచింగ్​ చేస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై ఎంక్వైరీ చేస్తున్నట్లు టౌన్​సీఐ నరేశ్‌‌‌‌ తెలిపారు.

టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసుల దాడులు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: అక్రమంగా మోరం రవాణా, మట్కా స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. మాక్లుర్ మండలం చిన్నాపూర్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మొరం రవాణా చేస్తున్న టిప్పర్ డ్రైవర్లు వల్లేపు మల్లేశ్‌‌‌‌, జాదవ్ సంతోష్‌‌‌‌, వల్లెపు రాములను అరెస్ట్ చేశారు. నగరంలోని వన్‌‌‌‌ టౌన్‌‌‌‌ పోలీస్ స్టేషన్‌‌‌‌ పరిధిలోని మిర్చి కాంపౌండ్‌‌‌‌లో మట్కా నిర్వహిస్తున్న బట్టు గంగాధర్‌‌‌‌‌‌‌‌ను కూడా అరెస్ట్ శారు. అతడి వద్ద నుంచి నగదుతో పాటు బైక్, సెల్ ఫోన్‌‌‌‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌‌‌‌కు పంపారు.

సైబర్ నేరాలపై అలర్ట్‌‌‌‌గా ఉండాలి

కామారెడ్డి, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు, కంపనీల నుంచి ఫోన్లు చేసి తమకు డబ్బులు పంపాలని,  ఓటీపీ నంబర్లు చెప్పాలంటే  చెప్పవద్దని కామారెడ్డి డీఎస్పీ సోమనాథం పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి సాందీపని డిగ్రీ కాలేజీలో సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలపై స్టూడెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మోసపోతే వెంటనే డయల్‌‌‌‌ 1930కు ఫోన్​చేసి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐలు నరేశ్‌‌‌‌, సునీల్, కాలేజీ డైరెక్టర్​హరిస్మరణ్‌‌‌‌రెడ్డి, ప్రిన్సిపాల్ సాయిబాబు, అడ్వకేట్​ సలీం పాల్గొన్నారు.  

ఎస్ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌లో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్

నవీపేట్, వెలుగు: మండలంలోని జన్నేపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సీబీఎస్ఈ స్కూల్‌‌‌‌లో శనివారం స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్‌‌‌‌ నిర్వహించారు. ఈ ఎన్నికలో 9వ తరగతి విద్యార్థులు 11 మంది పోటీ పడగా ఒకటి నుంచి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు ఓటు వేశారు. గెలుపొందిన విద్యార్థులకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు ఇద్దరిని విద్యార్థి నాయకులుగా, ఒక్కొక్కరిని క్రీడా శాఖ, క్రమశిక్షణ, సాంస్కృతిక శాఖ సెక్రటరీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మారయ్యగౌడ్, సీఈవో హరిత గౌడ్, ఎస్సై రాజారెడ్డి, ప్రిన్సిపాల్ భాస్కర్, సంజీవరావు పాల్గొన్నారు.    

అనుమతులు లేని దుకాణాలు సీజ్ చేయాలి

నిజామాబాద్, వెలుగు: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పటాకుల దుకాణాలను సీజ్ చేయాలని కలెక్టర్​సి.నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఏరియాల్లో పటాకుల విక్రయకేంద్రాల్లో తనిఖీలు చేపట్టాలన్నారు.

దీపావళి వేడుక నేపథ్యంలో కలెక్టర్ శనివారం రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ఫైర్ తదితర శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు జిల్లాలో ఎక్కడ కూడా ప్రమాద ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  అడిషనల్‌‌‌‌ కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు.

బ్యాంకు చోరీ కేసులో మరొకరి అరెస్ట్‌

లారీ,116 గ్రాముల బంగారు స్వాధీనం 

బాల్కొండ, వెలుగు: సంచలనం సృష్టించిన మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామీణ బ్యాంక్‌‌‌‌ చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. బాల్కొండ పోలీస్ స్టేషన్‌‌‌‌లో శనివారం విలేకరుల సమావేశంలో నిజామాబాద్ సీపీ కె.ఆర్ నాగరాజు  వివరాలు వెల్లడించారు. బుస్సాపూర్‌‌‌‌‌‌‌‌లో జులై 4న జరిగిన బ్యాంకు చోరీ కేసులో మరో నిందితుడు సలీంను పట్టుకున్నట్లు తెలిపారు.

యూపీకి చెందిన సలీం లారీ క్లీనర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తూ మహారాష్ట్రలోని నాగపూర్ వాడి వద్ద జాన్సన్ ట్రాన్స్‌‌‌‌ పోర్ట్ కంపెనీ దగ్గర ఉన్నట్లు సమాచారం అందడంతో ఆర్మూర్ సీఐ గోవర్ధన్, పోలీసులతో అక్కడికి వెళ్ల పట్టుకున్నారని, అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. అతడి వద్ద నుంచి లారీ, 116 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏసీపీ ఆర్.ప్రభాకర్, రూరల్ సీఐ గోవర్ధన్‌‌‌‌ రెడ్డి  టీం సభ్యులు చాకచ్యంగా కేసును ఛేదించారని వారి 
అభినందించారు.

ఏవోల సమస్యల పరిష్కారానికి కృషి

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: ఏవోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్‌‌‌‌​అసోసియేషన్​ చైర్మన్‌‌‌‌  కృపాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. శనివారం మండల కేంద్రంలో ఉమ్మడి జిల్లా ఏవోల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవోలు తమ సమస్యలను చైర్మన్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌ఫర్లు, ఆఫీసుల రిపేర్లు, వెహికల్​మొబిలిటీ వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్టేట్ జనరల్ సెక్రటరీ కృపాకర్‌‌‌‌‌‌‌‌రెడ్ది, కల్చరల్ అండ్ స్పోర్ట్స్​సెక్రటరీ రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ ప్రవీణ్ పాల్గొన్నారు.

బైక్ దొంగ అరెస్ట్​

భిక్కనూరు, వెలుగు:  పలు ప్రాంతాల్లో బైక్‌‌‌‌లు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని భిక్కనూరు పోలీసులు పట్టుకుని రిమాండ్‌‌‌‌కు తరలించారు. శనివారం సీఐ తిరుపయ్య వివరాలు వెల్లడించారు. స్థానిక టోల్​గేట్​ వద్ద శనివారం వెహికల్ చెక్​చేస్తుండగా మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన పూల్లూరి మల్లేశం అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకుని విచారించగా దొంగతనం విషయం బయటకొచ్చినట్లు తెలిపారు.

మల్లేశం నుంచి గత కొద్ది రోజుల కింద కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇతర చోట్ల చోరీ చేసిన మూడు బైక్‌‌‌‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్సైలు హైమద్, గాంధీగౌడ్, ఏఎస్సై జగదీశ్వర్ పాల్గొన్నారు.