
- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
యాదాద్రి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ‘మహాలక్ష్మి’ స్కీమ్ లో మహిళల ఫ్రీ జర్నీతో టెంపుల్స్‌కు ఇన్ కమ్ పెరిగిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ ఏడాదిలో టెంపుల్స్‌కు రూ. 176 కోట్ల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామిని శుక్రవారం మంత్రి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదాశీర్వచనాలు చేసి, స్వామి వారి ప్రసాదాలు అందించారు.
అనంతరం టెంపుల్సమాచారం కోసం కొత్తగా తెచ్చిన 'యాదగిరి' మాసపత్రిక, ఈ– -ఆఫీస్, గరుడ ట్రస్ట్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. టెంపుల్‌కు వచ్చిన భక్తులు నిద్ర చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఒకేరకంగా కాటేజీలు నిర్మించడానికి నిర్ణయించామని, వీటి నిర్మాణాలకు దాతల నుంచి నిధులు సేకరిస్తామన్నారు.
గుట్టలో కల్యాణ మంటపం, గోశాల నిర్మాణాలకు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని బాసర, కొండగట్టు, భద్రాచలం వంటి ఎనిమిది టెంపుల్స్అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేశామని తెలిపారు. భక్తులు ఒకేసారి రాష్ట్రంలోని ప్రధాన టెంపుల్స్‌లో దర్శనం చేసుకోవడానికి వీలుగా టెంపుల్‌టూరిజం తరహాలో బస్సులు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు.
భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. టెంపుల్డెవలప్మెంట్పై ఈవో వెంకట్రావ్ పవర్పాయింట్ప్రజంటేషన్ చేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కలెక్టర్ హనుమంతరావు ఉన్నారు.