రాజన్నసిరిసిల్ల,వెలుగు : సిరిసిల్ల నేతన్నల కోసం యారన్ డిపో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18 జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో యారన్ డిపో ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. యారన్ డిపో వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 40 వేల మరమగ్గాలపై పనిచేస్తున్న 30 వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుంది.
యారన్ డిపో ఏర్పాటు లో మరమగ్గాల పరిశ్రమలోని నేతన్నలు పెట్టుబడిదారులపై ఆధారపడకుండా నేరుగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ డిపోకు రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.