తెలంగాణ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా : మంత్రి కేటీఆర్

తెలంగాణ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లోని మాదాపూర్‌ నాలెడ్జ్ సిటీ రోడ్ ఐటీసీ కోహెనూర్‌లో వెజ్ ఆయిల్, ఆయిల్‌ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్‌ టేబుల్- 2022 సమావేశం జరిగింది. ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ - ఐవీపీఏ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐవీపీఏ అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్ పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమంలో వంట నూనెల రంగంలో సుస్థిర, స్వయం సమృద్ధి, ధరలు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. అయితే హిస్టారికల్ ప్రదేశం హైదరాబాద్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం సంతోషమని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మలేషియా, థాయిలాండ్ నుండి డెలిగేట్స్ వచ్చారన్న ఆయన.. ఇక్కడి ప్రదేశాలు చూడాలని, పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అన్న కేటీఆర్.. ఎనిమిదేళ్లలో ఎంతో పురోగతి సాధించామని స్పష్టం చేశారు.

ఇక్కడ నుండే 9 బిలియన్ డోస్ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి, ప్రపంచానికి వ్యాక్సిన్ అందించామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని, వ్యాక్సిన్ సిటీ హబ్ గా హైదరాబాద్ అవతరించిందని తెలిపారు. సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ గా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ ని ఎంచుకున్నాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సులభమైన పద్ధతులు అవలంబిస్తున్నామని చెప్పారు. టీఎస్ఐ పాస్ ద్వారా15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామన్న కేటీఆర్... ఆయిల్ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, తెలంగాణలో మీకు అనుమతులు త్వరగా వస్తాయని చెప్పారు. మలేషియా, థాయిలాండ్ నుండి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణలో ఎనిమిదేళ్ళలో గ్రీన్ కవర్ 24 శాతం పెరిగిందన్న ఆయన... వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కేవలం నాలుగేళ్లలో పూర్తి చేశామని చెప్పారు. 

ప్యాడీ ఉత్పత్తి పెరిగిందని, కేంద్రం తమ ప్యాడీని కొనుగోలు చేయమని చేతులు ఎత్తేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నమన్న ఆయన.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో పామాయిల్, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటల పరిశ్రమలకు అనుకూలమని చెప్పారు. వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, మహబూబ్ నగర్ గ్రౌండ్ నట్ కి అనుకూలమని స్పష్టం చేశారు.