
జైపూర్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్) తొలి ఎడిషన్‌లో తెలుగు టాలన్స్ జట్టు శుభారంభం చేసింది. గురువారం అట్టహాసంగా మొదలైన మెగా లీగ్ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ పేట్రియాట్స్ 28–27తో మహారాష్ట్ర ఐరన్‌మ్యాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
రెండో మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ దుమ్మురేపింది. గార్విట్ గుజరాత్‌తో తలపడిన టాలన్స్ 39-–32తో గెలిచింది. దేవేందర్ భుల్లార్, అనిల్ ఖుడియ, రఘు సత్తాచాటారు.