మొదటి సీజన్లోనే ఫైనల్కు తెలుగు యోధాస్

మొదటి సీజన్లోనే ఫైనల్కు తెలుగు యోధాస్

ఖో ఖో లీగ్ లో తెలుగు యోధాస్ ఫైనల్ చేరింది. ఆరంభ సీజన్ లోనే టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. శనివారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 23 పాయింట్ల తేడాతో తెలుగు యోధాస్ విజయం సాధించింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన  తెలుగు యోధాస్ 67–44 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను  ఓడించింది. ఇవాళ జరిగే ఫైనల్లో ఓడిశా జాగర్‌నట్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

తెలుగు యోధాస్ ఆల్ రౌండ్ షో..
క్వాలిఫయర్1 మ్యాచ్‌లో ఒడిశా చేతిలో ఓడిన తెలుగు యోధాస్ మరోసారి ఫైనల్లో ఆ జట్టుతోనే తలపడనుంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో తెలుగు యోధాస్ ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపింది. మూడో టర్న్‌లో గుజరాత్ జెయింట్స్ పోరాడినా ఫలితం లేకపోయింది. అభినందన్ పాటిల్ ఏకంగా 4.26 నిమిషాలు తప్పించి 8 బోనస్ పాయింట్లు సాధించినా గుజరాత్ కోలుకోలేకపోయింది. చివరి టర్న్‌లో తెలుగు యోధాస్ దుమ్మురేపి 61-29తో విజయం సాధించింది. 

సీజన్‌-1లో 100 డిఫెండింగ్ పాయింట్స్ సాధించిన తొలి జట్టుగా తెలుగు యోధాస్ టీమ్ నిలిచింది. తొలి టర్న్‌లో 37 పాయింట్లతో సత్తా చాటింది. ఇక ప్రత్యర్థికి కేవలం  13 పాయింట్లే ఇవ్వడం విశేషం. క్వాలిఫయర్ -2లో ఓడిన గుజరాత్ జెయింట్స్ రూ.30 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. టైటిల్ గెలిచిన జట్టుకు కోటీ రూపాయలు నజరానా దక్కనుంది. రన్నరప్‌కు రూ.50 లక్షలు దక్కనున్నాయి.