అమెరికాలో కాల్పులు..తెలుగు యువకుడి మృతి 

అమెరికాలో కాల్పులు..తెలుగు యువకుడి మృతి 

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి ఏపీలోని బాపట్ల  జిల్లాకు చెందిన దాసరి గోపికృష్ణగా గుర్తించారు. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపికృష్ణ జీవనోపాధి కోసం 8నెలల క్రితం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ రాష్ట్రం డాలస్ లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. 

శనివారం మధ్యాహ్నం గోపికృష్ణ కౌంటర్ లో ఉండగా ..ఓ దుండగుడు నేరుగా వచ్చిన తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో నిందితుడు సూపర్ మార్కెట్లోని ఓ వస్తువును తీసుకుని పరారీ అయ్యాడు.

 ఆతర్వాత  గోపికృష్ణను హాస్పిటల్ కు తరలించగా..ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆదివారం చనిపోయాడు.  మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు. మరోవైపు దుండగుడి కాల్పులు  జరిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.