యూరప్​లో భగభగ మండుతున్న ఎండలు

యూరప్​లో భగభగ మండుతున్న ఎండలు
  • భగభగ మండిన ఎండలు.. 
  • ఉక్కిరిబిక్కిరి చేసిన వడగాలులు.. 
  • కరిగిన రోడ్లు, రన్​వేలు.. 
  • సాగిన రైలు పట్టాలు..  
  • అడవుల్లో చెలరేగిన కార్చిచ్చులు.. ఆకాశంలో దట్టమైన పొగలు.. 
  • తగలబడిన వందల ఇండ్లు.. 
  • కాలిపోయిన లక్షలాది చెట్లు.. 
  • మలమలమాడిన పచ్చిక మైదానాలు.. నిలువునా ఎండిన పంట పొలాలు..
  • వందల సంఖ్యలో జనం మరణాలు.. 
  • వేల సంఖ్యలో జంతువులు, పక్షుల ఆహుతి ... ఇదీ రెండు వారాలుగా యూరప్​లో పరిస్థితి.

చరిత్రలో ఎప్పుడూ లేనంతగా యూరప్​లో టెంపరేచర్స్‌ పెరిగిపోయాయి. వడగాడ్పులు(హీట్​వేవ్స్​) చెలరేగాయి. పెనం మీద కూర్చోపెట్టినట్లు, గాలిలేని గుహల్లో బంధించినట్లు జనం అల్లాడిపోయారు. చల్లదనం కోసం బీచ్​లు, రిసార్ట్​ల వెంట పరుగులు తీశారు. అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి. వందలాది మంది ప్రజలతో పాటు వేల సంఖ్యలో జంతువుల, పక్షుల ప్రాణాలు పోయాయి. చాలా ఫ్యాక్టరీలు బంద్​ బోర్డ్​లు పెట్టాయి. చాలా చోట్ల కాలిపోతున్న ఇండ్లను కాపాడుకునేందుకు జనం, తగలబడుతున్న అడవులను రక్షించేందుకు ఫైర్​ ఇంజిన్​లతో అధికారులు కనిపించారు. లండన్​లో గూగుల్​, మైక్రోసాఫ్ట్​ వంటి కంపెనీలు ఆఫీసులకు సెలవులు ప్రకటించాయి. సోషల్​ మీడియాలో ‘#యూరప్​హీట్​వేవ్2022’​ ట్రెండ్​ అయ్యింది. ఇందులో తగలబడుతున్న ఇండ్లు, అడవులు, తరలిపోతున్న జనం ఫొటోలు ట్రెండింగ్​ అయ్యాయి.  బ్రిటన్, ఐర్లెండ్​, స్కాట్లాండ్, బెల్జియం, స్పెయిన్​, ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్​, గ్రీస్, క్రొయేషియా​, డెన్మార్క్, ఇటలీ.. ఒక్కటేమిటి యూరప్​లోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి. యూకే, ఫ్రాన్స్​, స్పెయిన్, పోర్చుగల్​లో  రోజుల తరబడి  రెడ్​ అలర్ట్స్​ ఇచ్చారు. ఒకరకంగా ఈ దేశాల్లోని చాలా నగరాల్లో అప్రకటిత లాక్​డౌన్​ కనిపించింది. ఈ ఏడాది సమ్మర్​ ఇంకా రెండు నెలలపాటు ఉందనేది యూరప్​ ప్రజలను కలవరపరుస్తోంది. 

నిప్పుల కుంపటిలా..    

ఎటుచూసినా పచ్చటి పచ్చిక మైదానాలు, దట్టమైన చెట్లతో నిండిన కొండలతో కనిపించే యూరప్​లో సాధారణంగా అన్ని కాలాల్లోనూ చల్లటి వాతావరణం ఉంటుంది. చలికాలంలో అయితే చాలాచోట్ల టెంపరేచర్స్‌ మైనస్​ల్లోకి వెళ్ళిపోతాయి. కొన్ని చోట్ల విపరీతంగా మంచు కూడా కురుస్తుంది. అలాగే ఏటా జూన్​ నుంచి నాలుగు నెలలపాటు, అంటే సెప్టెంబర్​ వరకు ఇక్కడ సమ్మర్​ ఉంటుంది. ఆ టైమ్​లో కూడా మహా అయితే టెంపరేచర్స్‌ మహా అయితే 28డిగ్రీల సెల్సియస్​కు మించవు. అందుకే ఎండాకాలంలో కూడా ఇక్కడ చల్లదనం ఉంటుంది. కానీ, ఈసారి అది తలకిందులైంది. యూరప్​లోని అన్ని దేశాల్లోనూ సాధారణంకంటే  ఎక్కువ టెంపరేచర్స్‌ రికార్డ్​ అయ్యాయి. ఆఫ్రికాకు ఆనుకొని ఉన్న స్పెయిన్, పోర్చుగల్​, ఇటలీ, గ్రీస్​ దేశాల్లో అయితే టెంపరేచర్​ 45డిగ్రీలు దాటింది. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, గ్రీస్, హంగేరీ, చెక్​ రిపబ్లిక్, ఇటలీ​లో 42 డిగ్రీలు తాకింది.  

కరిగిన రోడ్లు.. తగలబడిన అడవులు

టెంపరేచర్స్‌, వడగాలులు తీవ్రం కావడంతో యూరప్​ అతలాకుతలమైంది. యూరప్​లోని అన్నిదేశాల్లోనూ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ ఏడాది అంటే జూన్​ 2022లో వేసవి మొదలయ్యాక జులై చివరి నాటికే సుమారు ఐదు వేల మంది చనిపోయారు. వేలమంది రోడ్డునపడ్డారు. ఒక్క జర్మనీలోనే దాదాపు 1,600 మంది చనిపోయారు. స్పెయిన్​లో 1,200, పోర్చుగల్​లో 1,000, యూకేలో 100మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన దేశాల్లోనూ పదుల సంఖ్యలో మరణించారు. ఇక అడవుల్లో తగలబడిన జంతువులు, పక్షులకైతే లెక్కలేదు. కార్చిచ్చుల  కారణంగా ఫ్రాన్స్​లోని గిరోండేలో దాదాపు 15వేల హెక్టార్లలో అడవి అగ్నికి ఆహుతైంది. ఇటలీలో 860 హెక్టార్లు, పోర్చుగల్​లో మూడు వేల హెక్టార్లు, స్పెయిన్​లో నాలుగువేల హెక్టార్లలో అడవులు తగలబడిపోయాయి. ఈ ప్రాంతాల్లో అడవులకు ఆనుకొని ఉన్న వందలాది ఇండ్లు కూడా కాలిపోయాయి. వేలమంది ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చులు ఆపేందుకు రెస్క్యూ సిబ్బంది ఫైర్​ ఇంజిన్లు,హెలికాప్టర్లు, విమానాలతో నీళ్ళు చల్లారు. అడవులు ఏకధాటిగా తగలబడుతుండడంతో ఆకాశంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.  మరోవైపు రవాణా రంగంపైనా టెంపరేచర్స్‌, వడగాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. చాలాచోట్ల రోడ్లపై తారు కరిగిపోయింది. విమానాశ్రయాల్లోని రన్​వేలపైనా ఇదే పరిస్థితి.  ఫలితంగా వెహికల్స్, ఫ్లైట్స్​ తక్కువ సంఖ్యలో తిరిగాయి. కొన్నిచోట్ల ట్రాఫిక్​ సిగ్నల్స్​ హోర్డింగ్​లు కూడా కరిగిపోయాయంటే వడగాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  మరోవైపు విమానాల రాకపోకలపైన కూడా హీట్​వేవ్స్​ ప్రతాపం చూపించాయి. ఫ్రాన్స్​లో ఒక విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత వడగాడ్పుల కారణంగా మంటల్లో చిక్కుకొని కుప్పకూలిపోయింది. వడగాడ్పుల వల్ల ఎలక్ట్రిసిటీ గ్రిడ్​లు దెబ్బతినడంతో కొన్ని చోట్ల పవర్​ సప్లయ్​ ఆగిపోయి బ్లాక్​అవుట్​లు ఏర్పడ్డాయి. విండ్​ పవర్​ టర్బైన్స్​ హీటెక్కుతుండడంతో వాటిని ఆపేయాల్సి వచ్చింది. ఇక చాలా ‘జూ’లలోని జంతువులు వేడికి తాళలేక చచ్చిపోయాయి. స్పెయిన్, పోర్చుగల్​లోని వందల ‘జూ’లల్లో చనిపోయిన జంతువుల కళేబరాలు కనిపించాయి. కొన్ని జూలల్లో జంతువులను కాపాడుకునేందుకు వాటిపై చల్లటి నీళ్లు చల్లారు. ఏసీలు ఏర్పాటు చేశారు.  తీవ్రమైన టెంపరేచర్స్‌, వడగాడ్పుల వల్ల నీళ్ళతో నిండుగా కనిపించే చెరువులు, సరస్సులు, నదుల్లోనూ నీటి మట్టం తగ్గింది. ఇటలీలో వందలాది  చెరువులు, వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ కరువు పరిస్థితులు వచ్చాయనొచ్చు. ఇలాంటి పరిస్థితుల వల్ల టూరిస్ట్​ల సంఖ్య బాగా తగ్గిపోయింది.  

గ్రీన్​ల్యాండ్​​లో కరిగిన ఐస్​

ఏటా పెరుగుతున్న టెంపరేచర్స్‌ కారణంగా గ్రీన్​లాండ్​లో ఐస్​ బండలు కరుగుతున్నాయని, ఇది మంచిది కాదని ఇప్పటికే సైంటిస్ట్​లు అంటున్నారు. ఇప్పుడు అదనంగా హీట్​వేవ్స్​ తోడయ్యాయి. యూరప్​లోని మిగిలిన దేశాలకు కొంచెం దూరంలో ఉండే గ్రీన్​ల్యాండ్​లోపైన కూడా పడింది. ఈ ఏడాది జులై 15, 16, 17, 18, 19 తేదీల్లో యూరప్​లో ఎక్కువ టెంపరేచర్స్‌ నమోదయ్యాయి. వడగాడ్పులు వీచాయి. వాటి ప్రభావం వల్ల గ్రీన్​ల్యాండ్​లో ఆ ఐదు రోజుల్లో రోజుకు సుమారు ఆరు బిలియన్​ గ్యాలన్ల ఐస్​ కరిగినట్లు సైంటిస్ట్​లు చెప్పారు. ​ఈ నీటితో 72లక్షల ఒలింపిక్​ స్టేడియాలు నింపొచ్చని యుఎస్​ నేషనల్​ స్నో అండ్​ ఐస్​ డాటా సెంటర్​ చెప్పింది. 

ఈ నీరంతా సముద్రాల్లో కలవడం వల్ల  సముద్రమట్టాలు పెరిగి, చాలాదేశాల్లోని తీరప్రాంతం ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నిజానికి గ్రీన్​ల్యాండ్​లోని ఐస్​ మొత్తం కరిగిపోతే అది సముద్రమట్టాలను 7.5మీటర్ల ఎత్తుకు పెంచుతుంది. ఫలితంగా అనేక తీరప్రాంత పల్లెలు, పట్టణాలు మునిగిపోతాయి. మరోవైపు గ్రీస్​, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, స్లొవేనియా దేశాల్లో విస్తరించి ఉన్న ఆల్ఫ్స్​ పర్వత శ్రేణుల్లోని ఐస్​ దిబ్బలు(గ్లేసియర్స్​) కూడా వడగాడ్పులకు కరిగాయి. స్విట్జర్లాండ్​లో మంచినీటికి గ్లేసియర్స్​ చాలా ముఖ్యం. అందుకే అక్కడి​ ప్రభుత్వం గ్లేసియర్స్ కరిగిపోకుండా వాటిపై ప్లాస్టిక్​ షీట్స్​ కప్పింది.  
 
ఆ మూడూ కలవడం వల్లే..    

యూరప్​లో రోజుల తరబడి ఎక్కువ టెంపరేచర్స్‌ నమోదవడం, హీట్​వేవ్స్​ రావడం వెనక కారణాలను సైంటిస్ట్​లు, ఎన్విరాన్​మెంటలిస్ట్స్​ వేర్వేరుగా చెప్తున్నారు. వాళ్ళలో ఎక్కువమంది చెప్తున్నది గ్లోబల్​ వార్మింగ్ గురించే​. దీనివల్లే టెంపరేచర్స్‌ పెరిగి, హీట్​వేవ్స్​ వచ్చాయంటున్నారు. మరికొందరు మాత్రం జెట్​ స్ట్రీమ్​(భూమి వాతావరణంలో పడమర నుంచి తూర్పు వైపు వేగంగా తిరిగే గాలులు) రెండుగా విడిపోయి, తక్కువ పీడనం ఉన్న గాలులు కింది వైపు, ఎక్కువ పీడనం ఉన్న గాలులు పై వైపు వెళ్ళడం వల్ల హీట్​వేవ్స్ ఎక్కువ తీవ్రతతో వచ్చాయని చెప్తున్నారు.  ఇదే విషయాన్ని ఇటీవల వచ్చిన ఒక నివేదిక కూడా చెప్పింది. అయితే, మియామిలోని కో ఆపరేటివ్​ ఇని​స్టిట్యూట్​ ఫర్​ మెరైన్​ అండ్​ అట్మాస్పియరిక్​ స్టడీస్​ డైరెక్టర్​, ప్రొఫెసర్​ బెన్​ కిర్ట్​మాన్​ చెప్పేది మాత్రం వేరుగా ఉంది. ‘‘యూరప్​ మీదుగా వ్యాపించిన ‘కట్​‌‌– ఆఫ్​లో’ అని పిలిచే తక్కువ పీడనం ఉన్న గాలులు, ఉత్తర అట్లాంటిక్ సముద్రంపైన నుంచి వీచిన పశ్చిమ గాలులు(అజోర్స్​ హై), ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వచ్చిన గాలులు.. ఈ మూడు కలవడం వల్లే హీట్​వేవ్స్​ తీవ్రంగా ఉన్నాయి. ఆఫ్రికాలో అడవులు నరికివేత ఎక్కువ కావడంతో అక్కడి నుంచే వచ్చే సహారా వేడిగాలుల్లో తీవ్రత ఎక్కువ ఉంటోంది” అని చెప్పాడు. మామూలుగా అయితే ఈ సహారా గాలులు ఉత్తర అట్లాంటిక్​ సముద్రంపైన ఉండే అజోర్స్​హైతో కలసి అక్కడి నుంచి ఉత్తర అమెరికా వైపు వెళ్తాయి. కానీ, ఈసారి ‘కట్​ఆఫ్​‌‌–లో’ ప్రభావం వల్ల సహారా గాలులు స్పెయిన్​, పోర్చుగల్​ మీదుగా యూరప్​ వైపు మళ్ళాయి. అందువల్లే ఈ ఉత్పాతం వచ్చినట్లు పర్యావరణవేత్తలు చెప్తున్నారు. విచిత్రమేంటంటే కొందరు సంప్రదాయవాదులు మాత్రం సూర్యునికి దగ్గరగా భూమి జరుగుతుండడమే కారణమంటున్నారు!

గ్లోబల్​ వార్మింగే మూలం 

జెట్​ స్ట్రీమ్స్​, అజోర్స్​ హై, కట్​ఆఫ్​‌‌–లో.. యూరప్​లో సూర్యప్రతాపానికి ఇవి మూడే కారణమంటున్నా, వీటన్నింటికి మూలం మాత్రం గ్లోబల్​ వార్మింగే అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, ఎన్విరాన్​మెంటలిస్ట్​లు ఏకాభిప్రాయంతో చెప్తున్న మాట. యూకే వాతావరణ శాఖ(ఎంఈటీ) చేసిన సర్వే కూడా ఇదే విషయం చెప్పింది. దీని ప్రకారం పారిశ్రామిక విప్లవం(ఇండస్ట్రియల్​ రివల్యూషన్) తర్వాత పరిశ్రమలు పెరగడం, వెహికల్స్​ ఎక్కువగా వాడడడం వంటి వాటివల్ల ఏటా టెంపరేచర్స్​లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో కార్బన్​డయాక్సైడ్​(CO2), క్లోరోఫ్లోరోకార్బన్స్​, మిథేన్, నైట్రస్​ ఆక్సైడ్​ వంటి హానికారక వాయువులు పెరిగిపోయాయి. 

సూర్యుని నుంచి వచ్చే కిరణాలు భూమిపై పడినప్పుడు వచ్చే వేడిని తిరిగి వాతావరణంలోకి వెళ్ళకుండా ఈ హానికారక వాయువులు అడ్డుకుంటున్నాయి. ఫలితంగా టెంపరేచర్స్‌ పెరుగుతున్నాయి. అందువల్లే ఇండస్ట్రియల్​ రివల్యూషన్​ మొదలయ్యాక ఇప్పటివరకు భూమి సగటు టెంపరేచర్‌‌ దాదాపు 1.2 డిగ్రీల వరకు పెరిగిందని ఎంఈటీ సర్వే చెప్పింది. ఫలితంగానే హీట్​వేవ్స్​, తుఫాన్లు, హరికేన్​లు ఎక్కువ తీవ్రతతో వస్తున్నాయని చెప్తోంది. ప్రపంచమంతా వర్షాలు, కరువులకు కారణమయ్యే ‘ఎల్ ​నినో’, ‘లా నినో’పై ప్రభావం చూపేది కూడా టెంపరేచర్సే. 2020లో అమెరికాలో అత్యంత తీవ్రమైన హరికేన్​లు వచ్చి, వందల బిలియన్​ డాలర్ల నష్టం కలిగించడాన్ని ఉదాహరణగా సర్వే చెప్పింది. నిజానికి మనదేశంలోనూ కొన్నేండ్లుగా వేసవిలో టెంపరేచర్స్‌, వడగాడ్పులు పెరుగుతున్నాయి. అలాగే వర్షాకాలంలో చాలాచోట్ల కుండపోత వానలు పడి వరదలు కూడా వస్తున్నాయి. వీటన్నిటికి గ్లోబల్​ వార్మింగే మూలమనేది సైంటిస్ట్​లు, ఎన్విరాన్​మెంటలిస్ట్​లు ఎప్పటినుంచో చెప్తున్న మాట.

అమెరికా, ఆఫ్రికా, చైనాల్లోనూ.. 

యూరప్​నే కాదు ఈసారి హీట్​వేవ్స్​ అమెరికా, ఆఫ్రికా, చైనాలను కూడా బెంబేలెత్తించాయి. అమెరికాలోని సౌత్​వెస్ట్​, సెంట్రల్​ రాష్ట్రాల్లో ఎప్పుడూ లేనంతగా టెంపరేచర్స్‌ రికార్డ్​ అయ్యాయి. టెక్సాస్​, కొలారాడో, ఒక్లహామా, అర్కన్సాస్​ రాష్ట్రాలపై హీట్​వేవ్స్​ తడాఖా చూపించాయి. కాలిఫోర్నియాలోని యొషెమిటె నేషనల్​ పార్క్​ చాలా భాగం తగలబడింది. అలాగే వాకో సిటీలో 42.2డిగ్రీల టెంపరేచర్‌‌ నమోదైంది. టెక్సాస్​లో  వడగాడ్పుల్ని తట్టుకోలేక జనం బీచ్​ల బాట పట్టారు. అయితే, యూరప్​తో పోలిస్తే అమెరికాలో ప్రాణనష్టం చాలా తక్కువ. అమెరికాలో80శాతానికి పైగా ఇండ్లలో ఏసీలు ఉండడమే దీనికి కారణం. మరోవైపు ఈ ఏడాది చైనాలోనూ హీట్​వేవ్స్​ ప్రతాపం చూపించాయి. జులై 17నాటికే చైనాలోని సుమారు 86 సిటీల్లో హీట్​వేవ్​ అలెర్ట్స్​ జారీ చేశారు. ఇక్కడ చాలా నగరాల్లో టెంపరేచర్స్‌ ఎప్పుడూ లేని విధంగా 45డిగ్రీలకుపైనే కనిపించాయి. చైనా ఆర్థిక రాజధాని, సుమారు 2కోట్లకు పైగా జనాభా ఉన్న షాంఘై సిటీలో 1873 సంవత్సరం తర్వాత 2022లోనే హయ్యెస్ట్​ టెంపరేచర్‌‌ రికార్డు అయింది. అలాగే ఈ సిటీలో వరుసగా15రోజుల పాటు టెంపరేచర్‌‌ 40డిగ్రీలపైనే ఉంది. ఇండ్లలో రోజంతా ఏసీలు రన్​ అయ్యాయి. నాన్జింగ్, చోంగ్​కింగ్, వుహాన్​లోనూ ఇదే స్థాయిలో ఎండలు మండాయి. వడగాడ్పులు వీచాయి. చోంగ్​కింగ్​లోని ఒక పురాతన మ్యూజియంపైన ఉన్న రేకులు ఎండవేడికి కరిగిపోయిన ఫొటోలు సోషల్​మీడియాలో కనిపించాయి. ఆఫ్రికాలోని నార్త్​ కంట్రీస్​ కూడా ఈసారి తీవ్రమైన ఎండలు, వడగాలులు చూశాయి. ట్యునీషియాలో వచ్చిన హీట్​వేవ్​ కారణంగా ఆ దేశంలోని ప్రధాన ఆహార పంటల దిగుబడిపై ప్రభావం చూపింది. రాజధాని ట్యునిస్​లో జులై13న 48డిగ్రీల అత్యధిక టెంపరేచర్‌‌​ రికార్డ్​ అయింది. దాదాపు 40 ఏండ్ల కిందటి రికార్డును ఇది బద్ధలుకొట్టింది.  ​

ప్రపంచంపై ప్రభావం

గ్లోబలైజేషన్​ వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం అన్ని దేశాలపైనా ఉంటోంది. యూరప్​ హీట్​వేవ్స్​ ఎఫెక్ట్​ కూడా అలాగే ఉంటుందని సైంటిస్ట్​లు, ఎన్విరాన్​మెంటలిస్ట్​లు, వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. ‘సునామీలు, భూకంపాలు, యుద్ధాల మాదిరిగానే హీట్​వేవ్స్​ కూడా ప్రపంచ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1998 నుంచి 2021 మధ్య వచ్చిన హీట్​వేవ్స్​ వల్ల సుమారు 4లక్షల మందికి పైగా జనం చనిపోయారు. అదే సమయంలో వందల బిలియన్​ డాలర్లకు పైగా నష్టం జరిగింది. యూరప్​లోని 32 దేశాల్లోనే 1980–2000 మధ్య సుమారు 71బిలియన్​ డాలర్లకు పైగా నష్టం జరిగినట్లు మరొక సర్వే చెప్పింది.  ప్రపంచవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, వెహికల్స్​ సంఖ్య ఎక్కువ కావడం, అడవుల నరికివేత, అర్బనైజేషన్​ వంటివి గ్లోబల్​ వార్మింగ్​కు ముఖ్య కారణమని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు యూరప్​లో​ వచ్చిన హీట్​వేవ్స్ రావడానికి పరోక్షంగా గ్లోబల్​వార్మింగ్​​ ఎఫెక్టే అనేది స్పష్టం. 

హీట్​వేవ్స్​ వల్ల మరణాలు మాత్రం యూరప్​కే పరిమితమైనప్పటికీ అక్కడ అడవులు, పంటలు తగలబడడం, ఉత్పత్తి తగ్గడం అన్ని దేశాలపైనా ప్రభావం చూపిస్తుంది’ అని అంటున్నారు. కాగా, రోజుల తరబడి చెలరేగిన కార్చిచ్చుల వల్ల ఆకాశంలో కమ్ముకున్న దట్టమైన పొగలతో కార్బన్​డయాక్సైడ్​, మిథేన్​ వాయువులు వాతావరణంలో కలిసిపోయాయి. ​ ఫలితంగా గ్లోబల్​ వార్మింగ్​ మరింత వేగంగా పెరుగుతుంది. ఇది అన్ని దేశాలకూ ఇబ్బందే. అలాగే హీట్​వేవ్స్​ వల్ల యూరప్​లో చాలా వరకు పంటలు ఎండిపోయాయి.  కొన్ని పొలాలు మంటల్లో తగలబడిపోయాయి. ఫలితంగా  ధాన్యం, గడ్డి ఉత్పత్తి తగ్గిపోయింది. ఇది ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడానికి కారణమవుతుందని యుఎన్​వో(యునైటెడ్​ నేషన్స్​ ఆర్గనైజేషన్​) సైతం చెప్తోంది. అంతేకాదు, యూరప్​లో పంటల దిగుబడి తగ్గితే, ఇక్కడి నుంచి ఆఫ్రికాలాంటి పేద దేశాలకు తిండిగింజల సరఫరా తగ్గుతుంది. అంటే ఆఫ్రికన్​ దేశాల్లో ఆకలిచావులకు పరోక్షంగా ఈ హీట్​వేవ్స్​ కారణమైనట్లే. మరోవైపు హీట్​వేవ్స్​ వల్ల చాలా పరిశ్రమలను తాత్కాలికంగా బంద్​ చేయడంతో వాటి ఉత్పత్తి కూడా బాగా తగ్గింది. దాంతో ఆ ఫ్యాక్టరీల ప్రొడక్ట్స్​ను దిగుమతి చేసుకునే దేశాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విపరీతమైన టెంపరేచర్స్‌, వడగాడ్పుల కారణంగా యూరప్​లో రవాణా రంగం, టూరిజం కూడా దెబ్బతింది. ఇవి కూడా పరోక్షంగా ప్రపంచంపై ప్రభావం చూపిస్తాయని యూఎన్​వో చెప్తోంది.      యూరప్​ హీట్​వేవ్స్​ ప్రపంచానికొక గుణపాఠం. ఇప్పటికైనా గ్లోబల్​ వార్మింగ్​ను తగ్గించేందుకు అన్ని దేశాలూ కచ్చితంగా పనిచేయాల్సిన పరిస్థితి. అప్పుడే ఇలాంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కోగలం అని  ఐక్యరాజ్యసమితి చెప్తోంది. 

చరిత్రలో ఎప్పుడూ లేనంతగా యూరప్​లో టెంపరేచర్స్‌ పెరిగిపోయాయి. వడగాడ్పులు(హీట్​వేవ్స్​) చెలరేగాయి. పెనం మీద కూర్చోపెట్టినట్లు, గాలిలేని గుహల్లో బంధించినట్లు జనం అల్లాడిపోయారు. చల్లదనం కోసం బీచ్​లు, రిసార్ట్​ల వెంట పరుగులు తీశారు. అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి. వందలాది మంది ప్రజలతో పాటు వేల సంఖ్యలో జంతువుల, పక్షుల ప్రాణాలు పోయాయి. చాలా ఫ్యాక్టరీలు బంద్​ బోర్డ్​లు పెట్టాయి. చాలా చోట్ల కాలిపోతున్న ఇండ్లను కాపాడుకునేందుకు జనం, తగలబడుతున్న అడవులను రక్షించేందుకు ఫైర్​ ఇంజిన్​లతో అధికారులు కనిపించారు. లండన్​లో గూగుల్​, మైక్రోసాఫ్ట్​ వంటి కంపెనీలు ఆఫీసులకు సెలవులు ప్రకటించాయి. సోషల్​ మీడియాలో ‘#యూరప్​హీట్​వేవ్2022’​ ట్రెండ్​ అయ్యింది. ఇందులో తగలబడుతున్న ఇండ్లు, అడవులు, తరలిపోతున్న జనం ఫొటోలు ట్రెండింగ్​ అయ్యాయి.  బ్రిటన్, ఐర్లెండ్​, స్కాట్లాండ్, బెల్జియం, స్పెయిన్​, ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్​, గ్రీస్, క్రొయేషియా​, డెన్మార్క్, ఇటలీ.. ఒక్కటేమిటి యూరప్​లోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి. యూకే, ఫ్రాన్స్​, స్పెయిన్, పోర్చుగల్​లో  రోజుల తరబడి  రెడ్​ అలర్ట్స్​ ఇచ్చారు. ఒకరకంగా ఈ దేశాల్లోని చాలా నగరాల్లో అప్రకటిత లాక్​డౌన్​ కనిపించింది. ఈ ఏడాది సమ్మర్​ ఇంకా రెండు నెలలపాటు ఉందనేది యూరప్​ ప్రజలను కలవరపరుస్తోంది. 

నిప్పుల కుంపటిలా..  

ఎటుచూసినా పచ్చటి పచ్చిక మైదానాలు, దట్టమైన చెట్లతో నిండిన కొండలతో కనిపించే యూరప్​లో సాధారణంగా అన్ని కాలాల్లోనూ చల్లటి వాతావరణం ఉంటుంది. చలికాలంలో అయితే చాలాచోట్ల టెంపరేచర్స్‌ మైనస్​ల్లోకి వెళ్ళిపోతాయి. కొన్ని చోట్ల విపరీతంగా మంచు కూడా కురుస్తుంది. అలాగే ఏటా జూన్​ నుంచి నాలుగు నెలలపాటు, అంటే సెప్టెంబర్​ వరకు ఇక్కడ సమ్మర్​ ఉంటుంది. ఆ టైమ్​లో కూడా మహా అయితే టెంపరేచర్స్‌ మహా అయితే 28డిగ్రీల సెల్సియస్​కు మించవు. అందుకే ఎండాకాలంలో కూడా ఇక్కడ చల్లదనం ఉంటుంది. కానీ, ఈసారి అది తలకిందులైంది. యూరప్​లోని అన్ని దేశాల్లోనూ సాధారణంకంటే  ఎక్కువ టెంపరేచర్స్‌ రికార్డ్​ అయ్యాయి. ఆఫ్రికాకు ఆనుకొని ఉన్న స్పెయిన్, పోర్చుగల్​, ఇటలీ, గ్రీస్​ దేశాల్లో అయితే టెంపరేచర్​ 45డిగ్రీలు దాటింది. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, గ్రీస్, హంగేరీ, చెక్​ రిపబ్లిక్, ఇటలీ​లో 42 డిగ్రీలు తాకింది.  

కరిగిన రోడ్లు.. తగలబడిన అడవులు

టెంపరేచర్స్‌, వడగాలులు తీవ్రం కావడంతో యూరప్​ అతలాకుతలమైంది. యూరప్​లోని అన్నిదేశాల్లోనూ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ ఏడాది అంటే జూన్​ 2022లో వేసవి మొదలయ్యాక జులై చివరి నాటికే సుమారు ఐదు వేల మంది చనిపోయారు. వేలమంది రోడ్డునపడ్డారు. ఒక్క జర్మనీలోనే దాదాపు 1,600 మంది చనిపోయారు. స్పెయిన్​లో 1,200, పోర్చుగల్​లో 1,000, యూకేలో 100మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన దేశాల్లోనూ పదుల సంఖ్యలో మరణించారు. ఇక అడవుల్లో తగలబడిన జంతువులు, పక్షులకైతే లెక్కలేదు. కార్చిచ్చుల  కారణంగా ఫ్రాన్స్​లోని గిరోండేలో దాదాపు 15వేల హెక్టార్లలో అడవి అగ్నికి ఆహుతైంది. ఇటలీలో 860 హెక్టార్లు, పోర్చుగల్​లో మూడు వేల హెక్టార్లు, స్పెయిన్​లో నాలుగువేల హెక్టార్లలో అడవులు తగలబడిపోయాయి. ఈ ప్రాంతాల్లో అడవులకు ఆనుకొని ఉన్న వందలాది ఇండ్లు కూడా కాలిపోయాయి. వేలమంది ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చులు ఆపేందుకు రెస్క్యూ సిబ్బంది ఫైర్​ ఇంజిన్లు,హెలికాప్టర్లు, విమానాలతో నీళ్ళు చల్లారు. అడవులు ఏకధాటిగా తగలబడుతుండడంతో ఆకాశంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.  మరోవైపు రవాణా రంగంపైనా టెంపరేచర్స్‌, వడగాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. చాలాచోట్ల రోడ్లపై తారు కరిగిపోయింది. విమానాశ్రయాల్లోని రన్​వేలపైనా ఇదే పరిస్థితి.  ఫలితంగా వెహికల్స్, ఫ్లైట్స్​ తక్కువ సంఖ్యలో తిరిగాయి. కొన్నిచోట్ల ట్రాఫిక్​ సిగ్నల్స్​ హోర్డింగ్​లు కూడా కరిగిపోయాయంటే వడగాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  మరోవైపు విమానాల రాకపోకలపైన కూడా హీట్​వేవ్స్​ ప్రతాపం చూపించాయి. ఫ్రాన్స్​లో ఒక విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత వడగాడ్పుల కారణంగా మంటల్లో చిక్కుకొని కుప్పకూలిపోయింది. వడగాడ్పుల వల్ల ఎలక్ట్రిసిటీ గ్రిడ్​లు దెబ్బతినడంతో కొన్ని చోట్ల పవర్​ సప్లయ్​ ఆగిపోయి బ్లాక్​అవుట్​లు ఏర్పడ్డాయి. విండ్​ పవర్​ టర్బైన్స్​ హీటెక్కుతుండడంతో వాటిని ఆపేయాల్సి వచ్చింది. ఇక చాలా ‘జూ’లలోని జంతువులు వేడికి తాళలేక చచ్చిపోయాయి. స్పెయిన్, పోర్చుగల్​లోని వందల ‘జూ’లల్లో చనిపోయిన జంతువుల కళేబరాలు కనిపించాయి. కొన్ని జూలల్లో జంతువులను కాపాడుకునేందుకు వాటిపై చల్లటి నీళ్లు చల్లారు. ఏసీలు ఏర్పాటు చేశారు.  తీవ్రమైన టెంపరేచర్స్‌, వడగాడ్పుల వల్ల నీళ్ళతో నిండుగా కనిపించే చెరువులు, సరస్సులు, నదుల్లోనూ నీటి మట్టం తగ్గింది. ఇటలీలో వందలాది  చెరువులు, వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ కరువు పరిస్థితులు వచ్చాయనొచ్చు. ఇలాంటి పరిస్థితుల వల్ల టూరిస్ట్​ల సంఖ్య బాగా తగ్గిపోయింది.  

గ్రీన్​ల్యాండ్​​లో కరిగిన ఐస్​

ఏటా పెరుగుతున్న టెంపరేచర్స్‌ కారణంగా గ్రీన్​లాండ్​లో ఐస్​ బండలు కరుగుతున్నాయని, ఇది మంచిది కాదని ఇప్పటికే సైంటిస్ట్​లు అంటున్నారు. ఇప్పుడు అదనంగా హీట్​వేవ్స్​ తోడయ్యాయి. యూరప్​లోని మిగిలిన దేశాలకు కొంచెం దూరంలో ఉండే గ్రీన్​ల్యాండ్​లోపైన కూడా పడింది. ఈ ఏడాది జులై 15, 16, 17, 18, 19 తేదీల్లో యూరప్​లో ఎక్కువ టెంపరేచర్స్‌ నమోదయ్యాయి. వడగాడ్పులు వీచాయి. వాటి ప్రభావం వల్ల గ్రీన్​ల్యాండ్​లో ఆ ఐదు రోజుల్లో రోజుకు సుమారు ఆరు బిలియన్​ గ్యాలన్ల ఐస్​ కరిగినట్లు సైంటిస్ట్​లు చెప్పారు. ​ఈ నీటితో 72లక్షల ఒలింపిక్​ స్టేడియాలు నింపొచ్చని యుఎస్​ నేషనల్​ స్నో అండ్​ ఐస్​ డాటా సెంటర్​ చెప్పింది. 

ఈ నీరంతా సముద్రాల్లో కలవడం వల్ల  సముద్రమట్టాలు పెరిగి, చాలాదేశాల్లోని తీరప్రాంతం ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నిజానికి గ్రీన్​ల్యాండ్​లోని ఐస్​ మొత్తం కరిగిపోతే అది సముద్రమట్టాలను 7.5మీటర్ల ఎత్తుకు పెంచుతుంది. ఫలితంగా అనేక తీరప్రాంత పల్లెలు, పట్టణాలు మునిగిపోతాయి. మరోవైపు గ్రీస్​, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, స్లొవేనియా దేశాల్లో విస్తరించి ఉన్న ఆల్ఫ్స్​ పర్వత శ్రేణుల్లోని ఐస్​ దిబ్బలు(గ్లేసియర్స్​) కూడా వడగాడ్పులకు కరిగాయి. స్విట్జర్లాండ్​లో మంచినీటికి గ్లేసియర్స్​ చాలా ముఖ్యం. అందుకే అక్కడి​ ప్రభుత్వం గ్లేసియర్స్ కరిగిపోకుండా వాటిపై ప్లాస్టిక్​ షీట్స్​ కప్పింది.  
 
ఆ మూడూ కలవడం వల్లే..    

యూరప్​లో రోజుల తరబడి ఎక్కువ టెంపరేచర్స్‌ నమోదవడం, హీట్​వేవ్స్​ రావడం వెనక కారణాలను సైంటిస్ట్​లు, ఎన్విరాన్​మెంటలిస్ట్స్​ వేర్వేరుగా చెప్తున్నారు. వాళ్ళలో ఎక్కువమంది చెప్తున్నది గ్లోబల్​ వార్మింగ్ గురించే​. దీనివల్లే టెంపరేచర్స్‌ పెరిగి, హీట్​వేవ్స్​ వచ్చాయంటున్నారు. మరికొందరు మాత్రం జెట్​ స్ట్రీమ్​(భూమి వాతావరణంలో పడమర నుంచి తూర్పు వైపు వేగంగా తిరిగే గాలులు) రెండుగా విడిపోయి, తక్కువ పీడనం ఉన్న గాలులు కింది వైపు, ఎక్కువ పీడనం ఉన్న గాలులు పై వైపు వెళ్ళడం వల్ల హీట్​వేవ్స్ ఎక్కువ తీవ్రతతో వచ్చాయని చెప్తున్నారు.  ఇదే విషయాన్ని ఇటీవల వచ్చిన ఒక నివేదిక కూడా చెప్పింది. అయితే, మియామిలోని కో ఆపరేటివ్​ ఇని​స్టిట్యూట్​ ఫర్​ మెరైన్​ అండ్​ అట్మాస్పియరిక్​ స్టడీస్​ డైరెక్టర్​, ప్రొఫెసర్​ బెన్​ కిర్ట్​మాన్​ చెప్పేది మాత్రం వేరుగా ఉంది. ‘‘యూరప్​ మీదుగా వ్యాపించిన ‘కట్​‌‌– ఆఫ్​లో’ అని పిలిచే తక్కువ పీడనం ఉన్న గాలులు, ఉత్తర అట్లాంటిక్ సముద్రంపైన నుంచి వీచిన పశ్చిమ గాలులు(అజోర్స్​ హై), ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వచ్చిన గాలులు.. ఈ మూడు కలవడం వల్లే హీట్​వేవ్స్​ తీవ్రంగా ఉన్నాయి. ఆఫ్రికాలో అడవులు నరికివేత ఎక్కువ కావడంతో అక్కడి నుంచే వచ్చే సహారా వేడిగాలుల్లో తీవ్రత ఎక్కువ ఉంటోంది” అని చెప్పాడు. మామూలుగా అయితే ఈ సహారా గాలులు ఉత్తర అట్లాంటిక్​ సముద్రంపైన ఉండే అజోర్స్​హైతో కలసి అక్కడి నుంచి ఉత్తర అమెరికా వైపు వెళ్తాయి. కానీ, ఈసారి ‘కట్​ఆఫ్​‌‌–లో’ ప్రభావం వల్ల సహారా గాలులు స్పెయిన్​, పోర్చుగల్​ మీదుగా యూరప్​ వైపు మళ్ళాయి. అందువల్లే ఈ ఉత్పాతం వచ్చినట్లు పర్యావరణవేత్తలు చెప్తున్నారు. విచిత్రమేంటంటే కొందరు సంప్రదాయవాదులు మాత్రం సూర్యునికి దగ్గరగా భూమి జరుగుతుండడమే కారణమంటున్నారు!

గ్లోబల్​ వార్మింగే మూలం 

జెట్​ స్ట్రీమ్స్​, అజోర్స్​ హై, కట్​ఆఫ్​‌‌–లో.. యూరప్​లో సూర్యప్రతాపానికి ఇవి మూడే కారణమంటున్నా, వీటన్నింటికి మూలం మాత్రం గ్లోబల్​ వార్మింగే అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, ఎన్విరాన్​మెంటలిస్ట్​లు ఏకాభిప్రాయంతో చెప్తున్న మాట. యూకే వాతావరణ శాఖ(ఎంఈటీ) చేసిన సర్వే కూడా ఇదే విషయం చెప్పింది. దీని ప్రకారం పారిశ్రామిక విప్లవం(ఇండస్ట్రియల్​ రివల్యూషన్) తర్వాత పరిశ్రమలు పెరగడం, వెహికల్స్​ ఎక్కువగా వాడడడం వంటి వాటివల్ల ఏటా టెంపరేచర్స్​లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో కార్బన్​డయాక్సైడ్​(CO2), క్లోరోఫ్లోరోకార్బన్స్​, మిథేన్, నైట్రస్​ ఆక్సైడ్​ వంటి హానికారక వాయువులు పెరిగిపోయాయి. 

సూర్యుని నుంచి వచ్చే కిరణాలు భూమిపై పడినప్పుడు వచ్చే వేడిని తిరిగి వాతావరణంలోకి వెళ్ళకుండా ఈ హానికారక వాయువులు అడ్డుకుంటున్నాయి. ఫలితంగా టెంపరేచర్స్‌ పెరుగుతున్నాయి. అందువల్లే ఇండస్ట్రియల్​ రివల్యూషన్​ మొదలయ్యాక ఇప్పటివరకు భూమి సగటు టెంపరేచర్‌‌ దాదాపు 1.2 డిగ్రీల వరకు పెరిగిందని ఎంఈటీ సర్వే చెప్పింది. ఫలితంగానే హీట్​వేవ్స్​, తుఫాన్లు, హరికేన్​లు ఎక్కువ తీవ్రతతో వస్తున్నాయని చెప్తోంది. ప్రపంచమంతా వర్షాలు, కరువులకు కారణమయ్యే ‘ఎల్ ​నినో’, ‘లా నినో’పై ప్రభావం చూపేది కూడా టెంపరేచర్సే. 2020లో అమెరికాలో అత్యంత తీవ్రమైన హరికేన్​లు వచ్చి, వందల బిలియన్​ డాలర్ల నష్టం కలిగించడాన్ని ఉదాహరణగా సర్వే చెప్పింది. నిజానికి మనదేశంలోనూ కొన్నేండ్లుగా వేసవిలో టెంపరేచర్స్‌, వడగాడ్పులు పెరుగుతున్నాయి. అలాగే వర్షాకాలంలో చాలాచోట్ల కుండపోత వానలు పడి వరదలు కూడా వస్తున్నాయి. వీటన్నిటికి గ్లోబల్​ వార్మింగే మూలమనేది సైంటిస్ట్​లు, ఎన్విరాన్​మెంటలిస్ట్​లు ఎప్పటినుంచో చెప్తున్న మాట.

అమెరికా, ఆఫ్రికా, చైనాల్లోనూ.. 

యూరప్​నే కాదు ఈసారి హీట్​వేవ్స్​ అమెరికా, ఆఫ్రికా, చైనాలను కూడా బెంబేలెత్తించాయి. అమెరికాలోని సౌత్​వెస్ట్​, సెంట్రల్​ రాష్ట్రాల్లో ఎప్పుడూ లేనంతగా టెంపరేచర్స్‌ రికార్డ్​ అయ్యాయి. టెక్సాస్​, కొలారాడో, ఒక్లహామా, అర్కన్సాస్​ రాష్ట్రాలపై హీట్​వేవ్స్​ తడాఖా చూపించాయి. కాలిఫోర్నియాలోని యొషెమిటె నేషనల్​ పార్క్​ చాలా భాగం తగలబడింది. అలాగే వాకో సిటీలో 42.2డిగ్రీల టెంపరేచర్‌‌ నమోదైంది. టెక్సాస్​లో  వడగాడ్పుల్ని తట్టుకోలేక జనం బీచ్​ల బాట పట్టారు. అయితే, యూరప్​తో పోలిస్తే అమెరికాలో ప్రాణనష్టం చాలా తక్కువ. అమెరికాలో80శాతానికి పైగా ఇండ్లలో ఏసీలు ఉండడమే దీనికి కారణం. మరోవైపు ఈ ఏడాది చైనాలోనూ హీట్​వేవ్స్​ ప్రతాపం చూపించాయి. జులై 17నాటికే చైనాలోని సుమారు 86 సిటీల్లో హీట్​వేవ్​ అలెర్ట్స్​ జారీ చేశారు. ఇక్కడ చాలా నగరాల్లో టెంపరేచర్స్‌ ఎప్పుడూ లేని విధంగా 45డిగ్రీలకుపైనే కనిపించాయి. చైనా ఆర్థిక రాజధాని, సుమారు 2కోట్లకు పైగా జనాభా ఉన్న షాంఘై సిటీలో 1873 సంవత్సరం తర్వాత 2022లోనే హయ్యెస్ట్​ టెంపరేచర్‌‌ రికార్డు అయింది. అలాగే ఈ సిటీలో వరుసగా15రోజుల పాటు టెంపరేచర్‌‌ 40డిగ్రీలపైనే ఉంది. ఇండ్లలో రోజంతా ఏసీలు రన్​ అయ్యాయి. నాన్జింగ్, చోంగ్​కింగ్, వుహాన్​లోనూ ఇదే స్థాయిలో ఎండలు మండాయి. వడగాడ్పులు వీచాయి. చోంగ్​కింగ్​లోని ఒక పురాతన మ్యూజియంపైన ఉన్న రేకులు ఎండవేడికి కరిగిపోయిన ఫొటోలు సోషల్​మీడియాలో కనిపించాయి. ఆఫ్రికాలోని నార్త్​ కంట్రీస్​ కూడా ఈసారి తీవ్రమైన ఎండలు, వడగాలులు చూశాయి. ట్యునీషియాలో వచ్చిన హీట్​వేవ్​ కారణంగా ఆ దేశంలోని ప్రధాన ఆహార పంటల దిగుబడిపై ప్రభావం చూపింది. రాజధాని ట్యునిస్​లో జులై13న 48డిగ్రీల అత్యధిక టెంపరేచర్‌‌​ రికార్డ్​ అయింది. దాదాపు 40 ఏండ్ల కిందటి రికార్డును ఇది బద్ధలుకొట్టింది.  ​

ప్రపంచంపై ప్రభావం

గ్లోబలైజేషన్​ వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం అన్ని దేశాలపైనా ఉంటోంది. యూరప్​ హీట్​వేవ్స్​ ఎఫెక్ట్​ కూడా అలాగే ఉంటుందని సైంటిస్ట్​లు, ఎన్విరాన్​మెంటలిస్ట్​లు, వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. ‘సునామీలు, భూకంపాలు, యుద్ధాల మాదిరిగానే హీట్​వేవ్స్​ కూడా ప్రపంచ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1998 నుంచి 2021 మధ్య వచ్చిన హీట్​వేవ్స్​ వల్ల సుమారు 4లక్షల మందికి పైగా జనం చనిపోయారు. అదే సమయంలో వందల బిలియన్​ డాలర్లకు పైగా నష్టం జరిగింది. యూరప్​లోని 32 దేశాల్లోనే 1980–2000 మధ్య సుమారు 71బిలియన్​ డాలర్లకు పైగా నష్టం జరిగినట్లు మరొక సర్వే చెప్పింది.  ప్రపంచవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, వెహికల్స్​ సంఖ్య ఎక్కువ కావడం, అడవుల నరికివేత, అర్బనైజేషన్​ వంటివి గ్లోబల్​ వార్మింగ్​కు ముఖ్య కారణమని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు యూరప్​లో​ వచ్చిన హీట్​వేవ్స్ రావడానికి పరోక్షంగా గ్లోబల్​వార్మింగ్​​ ఎఫెక్టే అనేది స్పష్టం. 

హీట్​వేవ్స్​ వల్ల మరణాలు మాత్రం యూరప్​కే పరిమితమైనప్పటికీ అక్కడ అడవులు, పంటలు తగలబడడం, ఉత్పత్తి తగ్గడం అన్ని దేశాలపైనా ప్రభావం చూపిస్తుంది’ అని అంటున్నారు. కాగా, రోజుల తరబడి చెలరేగిన కార్చిచ్చుల వల్ల ఆకాశంలో కమ్ముకున్న దట్టమైన పొగలతో కార్బన్​డయాక్సైడ్​, మిథేన్​ వాయువులు వాతావరణంలో కలిసిపోయాయి. ​ ఫలితంగా గ్లోబల్​ వార్మింగ్​ మరింత వేగంగా పెరుగుతుంది. ఇది అన్ని దేశాలకూ ఇబ్బందే. అలాగే హీట్​వేవ్స్​ వల్ల యూరప్​లో చాలా వరకు పంటలు ఎండిపోయాయి.  కొన్ని పొలాలు మంటల్లో తగలబడిపోయాయి. ఫలితంగా  ధాన్యం, గడ్డి ఉత్పత్తి తగ్గిపోయింది. ఇది ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడానికి కారణమవుతుందని యుఎన్​వో(యునైటెడ్​ నేషన్స్​ ఆర్గనైజేషన్​) సైతం చెప్తోంది. అంతేకాదు, యూరప్​లో పంటల దిగుబడి తగ్గితే, ఇక్కడి నుంచి ఆఫ్రికాలాంటి పేద దేశాలకు తిండిగింజల సరఫరా తగ్గుతుంది. అంటే ఆఫ్రికన్​ దేశాల్లో ఆకలిచావులకు పరోక్షంగా ఈ హీట్​వేవ్స్​ కారణమైనట్లే. మరోవైపు హీట్​వేవ్స్​ వల్ల చాలా పరిశ్రమలను తాత్కాలికంగా బంద్​ చేయడంతో వాటి ఉత్పత్తి కూడా బాగా తగ్గింది. దాంతో ఆ ఫ్యాక్టరీల ప్రొడక్ట్స్​ను దిగుమతి చేసుకునే దేశాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విపరీతమైన టెంపరేచర్స్‌, వడగాడ్పుల కారణంగా యూరప్​లో రవాణా రంగం, టూరిజం కూడా దెబ్బతింది. ఇవి కూడా పరోక్షంగా ప్రపంచంపై ప్రభావం చూపిస్తాయని యూఎన్​వో చెప్తోంది.యూరప్​ హీట్​వేవ్స్​ ప్రపంచానికొక గుణపాఠం. ఇప్పటికైనా గ్లోబల్​ వార్మింగ్​ను తగ్గించేందుకు అన్ని దేశాలూ కచ్చితంగా పనిచేయాల్సిన పరిస్థితి. అప్పుడే ఇలాంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కోగలం అని  ఐక్యరాజ్యసమితి చెప్తోంది. 

40 డిగ్రీలకే ఎందుకిలా?

ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 40 డిగ్రీలు టెంపరేచర్స్‌ సర్వసాధారణం. ఇక్కడి దేశాల్లో చాలాచోట్ల ఎండాకాలంలో టెంపరేచర్స్‌ 47డిగ్రీలకు పైనే ఉంటాయి. మనదేశంలోని రాజస్తాన్​లో ఉన్న జైసల్మేర్​తోపాటు, పాకిస్తాన్​, ఇరాన్, ఇరాక్​, కువైట్​, గల్ఫ్​ దేశాలు, ఆఫ్రికాలోని సూడాన్​, కెన్యా, ఇథియోపియా, ఈజిప్ట్​, సోమాలియాలో కొన్నిచోట్ల 50 డిగ్రీలకు పైన కూడా టెంపరేచర్స్‌ రికార్డ్​ అయ్యాయి. అయినా, ఇక్కడ వడగాడ్పుల వల్ల నష్టం మరీ ఎక్కువగా ఎప్పుడూ కనిపించలేదు. కానీ, యూరప్​లో మాత్రం 40 డిగ్రీలకే పరిస్థితి తలకిందులైంది. కారణం, అక్కడ జియోగ్రాఫికల్​ పరిస్థితులు. అందుకే యూరప్​లో టెంపరేచర్స్‌ 38డిగ్రీలకు ఆనుకొని వచ్చినా చాలు రెడ్ అలర్ట్​ జారీ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ చల్లటి వాతావరణం ఉండే దేశాలు. 

ఇక్కడి ఇండ్లను శీతల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొనే కడతారు. అందుకే అక్కడ ఏసీ ఉండే ఇండ్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. 2008లో లండన్​లోని మింటెల్ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం బ్రిటన్​లో కేవలం 0.5శాతం ఇండ్లలో మాత్రమే ఏసీలు ఉన్నాయి. అంటే ప్రతి 200 ఇండ్లలో ఒక ఇంటికి మాత్రమే ఏసీ ఉంది. ఇక యూరప్​ అంతటా చూస్తే 80శాతం ఇండ్లలో ఏసీ ఉండదు. అంతేకాదు, యూరప్​లోని హాస్పిటల్స్​, స్కూల్స్​, మ్యూజియమ్స్​​... ఇలా చాలా వాటిలో ఏసీ ఉండదు. వేసవిలోనూ టెంపరేచర్స్‌ 30కి మించకపోవడం దీనికి కారణం.‘ఇక్కడి వాతావరణానికి ఏసీ సరిపడదని జనాల నమ్మకం. అదీ కాక, సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే టెంపరేచర్స్‌ ఎక్కువ ఉంటాయి. దానికోసం ఏసీలు అనవసరమని జనం అనుకుంటారు. అందుకే ఇండ్లలో ఏసీలు కనిపించవు. అలాగే స్కూల్స్​, హాస్పిటల్స్​, మ్యూజియమ్స్​లో కూడా ఏసీలు ఉండవు. అయితే, ఏసీకి బదులు ఇండ్లకు, బిల్డింగ్​లకు పెద్ద పెద్ద కిటికీలు, గ్లాస్​ డోర్​లు పెట్టించుకుంటారు. ఎండ తీవ్రత ఎక్కువై, వడగాలులు వస్తున్నప్పుడు కిటికీలు, డోర్​లు మూసేసి, టేబుల్​ ఫ్యాన్​ దగ్గర కూర్చుంటారు. డీహైడ్రేషన్​ రాకుండా తడి టవల్​తో శరీరం చల్లబరుచుకుంటారు’ అని యూనివర్సిటీ ఆఫ్​ మియామికి చెందిన రీసెర్చర్​ షారన్​ మజుందార్​ చెప్పారు.  రోడ్లు, రన్​వేలపై తారు కరిగిపోవడానికి కారణం కూడా చెప్పాడాయన. ‘అవన్నీ ఏండ్ల కిందట కట్టినవి. గరిష్ఠంగా 38డిగ్రీల వరకు తట్టుకునేలా అప్పట్లో కట్టారు. అంతకు మించి టెంపరేచర్‌‌ పెరిగితే వాటిపై ఉండే తారు కరిగిపోతుంది. అయితే, టెంపరేచర్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని రైల్వేమార్గాల్లోని పట్టాలకు మాత్రం తెల్లరంగు పూస్తారు. అందువల్లే అవి ఎక్కువ టెంపరేచర్స్‌ కూడా తట్టుకుంటున్నాయి’ అని చెప్పాడాయన.  

హీట్​వేవ్​ అంటే? 

సమ్మర్​లో చాలాదేశాల్లో హీట్​వేవ్స్​ రావడం మామూలే. ఒక ప్రదేశంలో గరిష్ఠ టెంపరేచర్స్‌ వరుసగా రెండు కంటే ఎక్కువ రోజులు నమోదైతే వడగాడ్పు(హీట్​వేవ్​) లేదా వడగాలిగా ప్రకటిస్తారు. ఈ టెంపరేచర్స్​లో ఆయా దేశాలను బట్టి మార్పులు ఉంటాయి. ఉదాహరణకు సాధారణంగా మనదేశంలో టెంపరేచర్‌‌ 45డిగ్రీలకు మించదని చెప్తారు. దీన్ని మించిన టెంపరేచర్స్‌ వరుసగా రెండు రోజులు వచ్చాయంటే వడగాడ్పుల ప్రమాదం ఉన్నట్లు హెచ్చరిస్తారు. ఇలాగే యూరప్​లో ఎక్కువ టెంపరేచర్‌‌ ఉండే సీజన్‌లో కూడా 38డిగ్రీలే నమోదవుతుంది. దీని కంటే ఎక్కువ టెంపరేచర్‌‌ వరుసగా రెండురోజులు నమోదైతే హీట్​వేవ్​పై రెడ్​ అలర్ట్​ ఇస్తారు. యూరప్​లో ఈ ఏడాది జులై 13నుంచి దాదాపు రెండు వారాలు గరిష్ఠం కంటే ఎక్కువ టెంపరేచర్స్‌ నమోదయ్యాయి. అందుకే ఎప్పుడూ లేనంతగా వడగాలులు ప్రభావం చూపించాయి. 

అప్పటి నుంచి నేర్చుకోని పాఠాలు

ఇంగ్లాండ్​, జర్మనీ, ఫ్రాన్స్​ లాంటి దేశాలకు..ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సమర్థంగా ఎదుర్కొంటాయని పేరు. కానీ, ఈసారి అది తప్పని తేలింది. ఎందుకంటే యూరప్​ను ఇంతకన్నా భయంకరమైన హీట్​వేవ్స్ 2003లో వణికించాయి. ఆ ఏడాది 45వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్​లోనే సుమారు 16వేల మంది చనిపోయినట్లు రికార్డులు చెప్తున్నాయి. చనిపోయిన వారిలో 60శాతం మంది పెద్దవయసు వాళ్లే. ఆ ఏడాది జూన్​లో మొదలైన వడగాడ్పులు ఆగస్ట్​ మధ్య వరకు వీచాయి. టెంపరేచర్స్‌ సాధారణ గరిష్ఠం కన్నా 20 నుంచి 30 శాతం వరకు ఎక్కువ రికార్డ్​ అయ్యాయి. ఇవి పర్యావరణంపైన కూడా తీవ్ర ప్రభావం చూపాయి. పశ్చిమ యూరప్​లో కార్చిచ్చుల వల్ల వేల ఎకరాల్లో అడవులు తగలబడిపోయాయి. ఆహారధాన్యాల దిగుబడి తగ్గింది. గడ్డి తక్కువైంది. పవర్​ స్టేషన్లు షట్​డౌన్​ అయ్యాయి. కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని తర్వాత అయినా యూరప్​ జాగ్రత్తలు తీసుకోలేదని ఇప్పటి హీట్​వేవ్స్​ నిరూపించాయి. మరోవైపు గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ ప్రకారం 2010లో రష్యాలో వచ్చిన హీట్​వేవ్స్​ అత్యంత భయంకరమైనవి. వీటి వల్ల దాదాపు 56వేల మంది చనిపోయారు. 1901లో అమెరికాలో వచ్చిన హీట్​వేవ్స్​ కూడా ఎక్కువ నష్టాన్ని కలిగించినవే. ఈ హీట్​వేవ్స్​ సుమారు పదివేల మందిని బలి తీసుకుంది. మనదేశంలో కూడా 2002లో వచ్చిన వడగాడ్పులకు 1200 మంది, 2015లో వచ్చిన హీట్​వేవ్స్​కు 2,500 మంది చనిపోయినట్లు రికార్డులు చెప్తున్నాయి.

మరిన్ని వస్తాయి: డబ్ల్యూఎమ్​వో

యూరప్​లో విధ్వంసం సృష్టించిన హీట్​వేవ్స్​ వంటివి మళ్ళీ మళ్ళీ  వస్తాయంటోంది ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్​వో). హీట్​వేవ్స్​ 2060 నాటికి తారస్థాయికి చేరతాయని హెచ్చరిస్తోంది. వీటి ఎఫెక్ట్​ ప్రధానంగా వ్యవసాయంపై ఉంటుందని, దిగుబడి భారీగా తగ్గి ఆహారకొరత వచ్చే ప్రమాదం ఉందంటోంది. ‘‘ఉక్రెయిన్​‌‌–రష్యా యుద్ధం వల్ల ఇప్పటికే ప్రపంచానికి ఆహార సమస్య  ఎదురవుతోంది.  యూరప్ హీట్​వేవ్స్​ ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఇవి ఇక్కడితో ఆగవు. 2060 నాటికి తీవ్రస్థాయికి చేరతాయి. వడగాడ్పుల ప్రభావం అగ్రికల్చర్​పై చాలాకాలం ఉంటుంది. ఇప్పటికే గ్రీన్​ల్యాండ్​లో ఐస్​ బండలు భారీగా కరుగుతున్నాయి. ఆల్ఫ్స్​ పర్వతాల్లోని గ్లేసియర్లు కూడా తగ్గిపోతున్నాయి. వీటి కారణంగా సముద్రమట్టాల్లో మరింత పెరుగుదల ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే మరో వందేండ్లలో భూమ్మీద చాలా భాగం నీళ్ళలో మునిగిపోతుంది” అని డబ్ల్యూఎమ్​వో ప్రధాన కార్యదర్శి పెటెరి తాలస్​ హెచ్చరిస్తున్నారు.   

సగం ప్రపంచం ప్రమాదంలో..

‘గ్లోబల్​ వార్మింగ్​ కారణంగా వరదలు, కరువులు, తీవ్రమైన తుఫాన్లు, కార్చిచ్చులు తరచూ వస్తున్నాయి. వీటివల్ల సగం ప్రపంచం తీవ్రమైన ప్రమాదంలో ఉంద’ని యుఎన్​వో సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గ్యుటెరస్​ హెచ్చరిస్తున్నారు. గ్లోబల్​ వార్మింగ్​ వల్ల పెరిగిన టెంపరేచర్స్‌ని 1.5డిగ్రీల మేరకు తగ్గించాలని చేసిన ‘2015 పారిస్​ అగ్రిమెంట్​’ను సరిగా అమలు చేయలేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నారు.  ఈ అగ్రిమెంట్​ను అప్పట్లో 40 దేశాలు అంగీకరించాయని చెప్పారు. అయితే, పాటించలేదన్నారు. యూరప్​లో చెలరేగిన హీట్​వేవ్స్​ను చూసైనా పారిస్​ అగ్రిమెంట్​ను కచ్చితంగా పాటించేందుకు సిద్ధం కావాలని అన్ని దేశాలనూ కోరారు. 2022 నవంబర్​లో జరగనున్న కాప్​26 సదస్సులో ఈ విషయం చర్చిస్తామన్నారు. ‘‘ గ్లోబల్​ వార్మింగ్​ వల్ల ఇప్పటికే ఆహారం, నీళ్ళ కొరత కనిపిస్తోంది. వ్యవసాయం కూడా ముప్పు ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో నీళ్ళ కోసం తీవ్రం ఇబ్బంది పడడం ఖాయం. అంతేకాదు, ​ పొల్యూషన్​ వల్ల ఊపిరి సమస్యలు తీవ్రమవుతాయి. ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 99శాతం మంది స్టాండర్డ్స్​​కు సరిపోయే విధంగా లేని గాలిని పీలుస్తున్నారు” అని డబ్ల్యూహెచ్​వో పబ్లిక్​ అండ్​ ఎన్విరాన్​మెంటల్​ హెల్త్​ డైరెక్టర్​ మరియా నైరా హెచ్చరించారు. 

హీట్​వేవ్స్​తో వచ్చే నష్టాలివే

హీట్​వేవ్స్​ కేవలం మనిషి ఆరోగ్యాన్నే కాదు, ప్రపంచ ఆర్థికరంగాన్ని కూడా దెబ్బతీస్తాయి. అదెలాగంటే..  

ఇన్​ఫ్రాస్ట్రక్చర్​కు దెబ్బ

హీట్​వేవ్స్​తో అనేక దేశాల్లో ఎకానమీ దెబ్బ తింటోంది. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​(మౌలిక సదుపాయాలు) దెబ్బతినడం.  రోడ్లు, రైళ్ళు, పవర్​ సప్లైని హీట్​వేవ్స్​ ఎక్కువ దెబ్బతీస్తుంది. రోడ్లు, రన్​వేలపై ఉండే తారును కరిగిస్తుంది. రైళ్ళ పట్టాలను సాగేలా చేస్తుంది. అలాగే ఎక్కువ టెంపరేచర్స్‌ పవర్​ కేబుల్స్​ను కూడా కరిగిస్తాయి. విద్యుత్​ బ్లాకవుట్స్​కు కారణమవుతాయి.  

ఉత్పత్తిపై..

తీవ్రమైన టెంపరేచర్స్‌ ఉన్నప్పుడు మనిషి పనితీరు తగ్గుతుంది. ఇది ఉద్యోగాన్ని బట్టి మారుతుంది. ఏసీ రూమ్​ల్లో కూర్చొని పనిచేసే వారికన్నా బయట, ఎండలో పనిచేసేవారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంటే రోజువారీ కూలీలు, రైతులు, డెలివరీ బాయ్స్, నిర్మాణ పనుల్లో ఉండేవాళ్లకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది. ఫలితంగా అవుట్​పుట్​ కూడా తగ్గుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపైన కూడా ఇలాంటి ప్రభావమే ఉంటుంది. ఒక​  సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సాధారణ గరిష్ఠ టెంపరేచర్స్‌ 2 డిగ్రీలు పెరిగితే ఒక్క అమెరికాలోని తూర్పు రాష్ట్రాల్లోనే సుమారు 60శాతం వరకు పంటల దిగుబడి తగ్గుతుంది. కిందటేడాది టెంపరేచర్స్‌ పెరగడం, హీట్​వేవ్స్​ కారణంగా మనదేశంలో గోధుమల దిగుబడి భారీగా తగ్గినట్లు పంజాబ్​ అగ్రికల్చర్​ యూనివర్సిటీ ప్రొఫెసర్లు రమన్​​దీప్​ కౌర్​, సిమర్జీత్​​ కౌర్​, సందీప్​ సింగ్​ సంధు చేసిన పరిశోధనలో తేలింది. అందువల్లే మనదేశం గోధుమల ఎగుమతిని నిలిపివేసినట్లు చెప్తున్నారు.   

షిప్పింగ్​, ఇండస్ట్రీపై..

హీట్​వేవ్స్​ పెరిగితే నదుల్లో, చెరువుల్లో నీటిమట్టాలు తగ్గుతాయి. దీనివల్ల పంటల సాగుతోపాటు సరకు రవాణాకు కూడా ఇబ్బంది కలుగుతుంది. నదుల్లో నీళ్లు తగ్గినప్పుడు పడవల ప్రయాణం కష్టమవుతుంది. యూరప్ హీట్​వేవ్స్​ ఇదే చెప్తున్నాయి. నెదర్లాండ్స్​లో పుట్టి డెన్మార్క్​, జర్మనీ, ఫ్రాన్స్​, మీదుగా స్విట్జర్లాండ్​కు చేరుకునే రైన్​ నది చుట్టూ ఎక్కువ ఇండస్ట్రీస్​ ఉన్నాయి. 1970లో హీట్​వేవ్స్​ వచ్చినప్పుడు నావలు తిరగడం కుదరక, ఈ ఇండస్ట్రీస్ అన్నీ తీవ్రంగా ఇబ్బందిపడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే స్థాయిలో హీట్​వేవ్స్​ రావడంతో రైన్​ నదిలో నీటి మట్టం చాలా చోట్ల తగ్గింది. ఫలితంగా షిప్పింగ్​, ఇండస్ట్రీస్​పై తీవ్ర ప్రభావం పడింది. అలాగే జలవిద్యుత్ కూడా తగ్గుతుంది. ఇప్పటి హీట్​వేవ్స్​ వల్ల జర్మనీ, ఫ్రాన్స్​, ఇటలీ, స్పెయిన్​లో ఇదే సమస్య ఎదురైంది. అలాగే అణువిద్యుత్​ కేంద్రాల్లో కూలింగ్​కు కావాల్సిన నీరు కూడా తగ్గింది. ఇవన్నీ కలిసి డిమాండ్​కు తగ్గట్టు ఫ్యాక్టరీలు, ఆఫీసుల పవర్​ సప్లై కావడం లేదు. దీంతో వాటి పనితీరు​పైనా ప్రభావం పడింది.  

::: గౌకనపల్లె మహేశ్వర​ రెడ్డి