మరో లెజెండ్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌కు వీడ్కోలు

మరో లెజెండ్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌కు వీడ్కోలు

లండన్‌‌‌‌‌‌‌‌‌‌: 24 ఏళ్ల కెరీర్‌‌‌‌.. 20 గ్రాండ్‌‌‌‌స్లామ్స్‌‌‌‌.. ఓవరాల్‌‌‌‌గా 103 టైటిల్స్‌‌‌‌.. 1251 విజయాలు.. 275 ఓటములు.. 310 వారాల పాటు నంబర్‌‌‌‌వన్‌‌‌‌ హోదా.. ఓపెన్‌‌‌‌ ఎరాలో లెక్కలేనన్ని  రికార్డులు, రివార్డులు సాధించిన స్విట్జర్లాండ్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ రోజర్‌‌‌‌ ఫెడరర్‌‌‌‌.. ప్రొఫెషనల్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌కు గురువారం రిటైర్మెంట్‌‌‌‌ ప్రకటించాడు. లండన్‌‌‌‌లో వచ్చే వారం జరిగే లావెర్‌‌‌‌ కప్‌‌‌‌ తనకు చివరి ఏటీపీ టోర్నమెంట్‌‌‌‌ అని చెప్పాడు. పురుషుల టెన్నిస్‌‌‌‌ హిస్టరీలో ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ గ్రేట్‌‌‌‌గా పేరు తెచ్చుకున్న ఫెడెక్స్‌‌‌‌.. ట్విటర్‌‌‌‌లో తన ఫేర్‌‌‌‌వెల్‌‌‌‌ సందేశాన్ని పంపాడు.

అమెరికా స్టార్‌‌‌‌ సెరెనా విలియమ్స్‌‌‌‌... ఆటకు గుడ్‌‌‌‌బై చెప్పి వారం కూడా గడవకముందే మరో లెజెండ్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌కు వీడ్కోలు పలకడం గమనార్హం. మోకాలికి వరుసగా ఆపరేషన్స్‌‌‌‌ చేయించుకున్న ఫెడరర్‌‌‌‌.. వింబుల్డన్‌‌‌‌ (2021 జులై)  నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే జులైలో ఆల్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌ క్లబ్‌‌‌‌ వందేళ్ల వార్షికోత్సవానికి హాజరైన ఫెడరర్‌‌‌‌.. మరోసారి ఇక్కడ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కానీ అంతలోనే గుడ్​బై చెప్పాడు. చివరిసారి వింబుల్డన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో హుబెర్ట్‌‌‌‌ హుర్కాజ్‌‌‌‌ చేతిలో ఓడిన ఫెడరర్‌‌‌‌.. వెంటనే కుడి మోకాలికి ఆపరేషన్‌‌‌‌ చేయించుకున్నాడు.