Sania Mirza: ఎల్బీ స్టేడియంలో సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్

Sania Mirza: ఎల్బీ స్టేడియంలో సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్

హైదరాబాద్లో ఆదివారం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ జరగనుంది. ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. టెన్నిస్ కు ఇప్పటికే సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ లో చివరి మ్యాచ్ హైదరాబాద్లో ఆడాలని భావించింది. సొంత గడ్డపై ఫేర్ వెల్  మ్యాచ్ ఆడనుండటం సంతోషంగా ఉందని సానియా మీర్జా తెలిపింది. హైదరాబాద్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పింది. రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీకి అధిక సమయం కేటాయిస్తానని చెప్పుకొచ్చింది. అటు హోమ్ టౌన్లో అభిమానుల కోసం ఆడబోతున్న ఈ మ్యాచ్కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది.  

చివరి మ్యాచ్..

భారత టెన్నిస్  స్టార్ సానియా మీర్జా తన 20ఏళ్ల  కెరీర్‌ను ఫిబ్రవరి 21న ముగించింది. దుబాయ్‌లో జరిగిన డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో ఓటమితో టెన్నిస్  కెరీర్ కు వీడ్కోలు పలికింది. తన చివరి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్సడ్ డబుల్స్ లో రన్నరప్గా నిలవగా...దుబాయ్ డ్యూటీ ఫ్రీ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. 

సానియా కెరీర్..

2003లో టెన్నిస్‌ లోకి అడుగుపెట్టిన  సానియా మీర్జా.... తన కెరీర్‌లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది. మార్టినా హింగిస్‌తో కలిసి మూడు ఉమెన్స్ డబుల్స్ టైటిల్స్  సాధించింది. మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ గెలిచింది. వాటిలో రెండు మహేష్ భూపతితో కలిసి సాధించింది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవగా....2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకుంది. బ్రూనో సోరెస్‌తో కలిసి యూఎస్ ఓపెన్ ట్రోఫీని సాధించింది. ఆసియా క్రీడల్లో ఎనిమిది, కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు పతకాలు దక్కించుకుంది. 2004లో అర్జున, 2015లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులను సానియా దక్కించుకోగా...ఆ తర్వాత పద్మశ్రీ, పద్మభూషణ్‌ కూడా పొందింది.