20 ఏండ్ల తర్వాత కలుసుకున్నరు

20 ఏండ్ల తర్వాత కలుసుకున్నరు

మిడ్జిల్, వెలుగు: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో 2003–04 టెన్త్  బ్యాచ్  స్టూడెంట్స్  20 ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. ఆదివారం స్కూల్​ ఆవరణలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆనందంగా గడిపారు. స్కూల్​ డెవలప్​మెంట్​ కోసం తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.

అప్పటి టీచర్లు విజయలక్ష్మి, రామాంజన్ రెడ్డి, శ్రీనివాసులు, మధు, నారాయణ, కృష్ణ, అండాలమ్మ, ప్రేమలత, రవి శంకర్ ను సన్మానించారు. పూర్వ విద్యార్థులు మాసుం బాబా, రామానుజన్, శ్రీనివాస్ రెడ్డి, మక్బూల్, రవి, నీలకంఠం, తిరుపతి, మధుసూదన్ రెడ్డి, బి. పర్వతయ్య, సంపూర్ణ, సుజాత, మునీర పాల్గొన్నారు.