ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యధాతథం

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యధాతథం
  • ఒకవేళ కేసులు పెరిగితే అప్పుడు ఆలోచిస్తాం –మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి: ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై గందరగోళం చెలరేగడంతో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పందించి ప్రకటన చేశారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని పునరుద్ఘాటించారు. అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. ముందు రోజుల్లో ఒక వేళ కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ తో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై మరోసారి చర్చిస్తామని.. ఇప్పటికయితే యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.