
ఈవీ కంపెనీ టెస్లా భారత్‌లో మొదటి ఛార్జింగ్ స్టేషన్‌ను ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వద్ద ప్రారంభించింది. ఇందులో నాలుగు వీ4 సూపర్‌ఛార్జింగ్ (డీసీ ఛార్జింగ్) స్టాల్స్ ఉన్నాయి.
కిలోవాట్‌కు రూ.24 వసూలు చేస్తారు. నాలుగు డెస్టినేషన్ ఛార్జింగ్ స్టాల్స్ (ఏసీ ఛార్జింగ్) ఉన్నాయి. కిలోవాట్‌కు రూ.14 వసూలు చేస్తారు. లోయర్ పరేల్, థానే, నవీ ముంబైలో మరో మూడు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని కంపెనీ చెబుతోంది.