థాయ్‌‌లాండ్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌–500 టోర్నీ నుంచి ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ లక్ష్యసేన్‌ ఔట్..

థాయ్‌‌లాండ్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌–500 టోర్నీ నుంచి ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ లక్ష్యసేన్‌ ఔట్..

బ్యాంకాక్‌‌: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ లక్ష్యసేన్‌‌.. థాయ్‌‌లాండ్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌–500 టోర్నీలో నిరాశపర్చాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో లక్ష్య 18–21, 21–9, 17–21తో ఎన్‌‌హట్‌‌ ఎన్గుయెన్‌‌ (ఐర్లాండ్‌‌) చేతిలో పోరాడి ఓడాడు. మరో మ్యాచ్‌‌లో ప్రియాన్షు రజావత్‌‌ 13–21, 21–17, 16–21తో అల్వి పర్హాన్‌‌ (ఇండోనేసియా) చేతిలో కంగు తిన్నాడు.

విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో మాళవిక బన్సోద్‌‌ 21–12, 13–21, 21–17తో నిస్లిహన్‌‌ హరీన్‌‌(టర్కీ)పై, ఆకర్షి కశ్యప్‌‌ 21–16, 20–22, 22–20తో కరోర్‌‌ సుగియామ (జపాన్‌‌)పై, ఉన్నతి హుడా 21–14, 18–21, 23–21తో తమనోవన్‌‌ నితిటిక్రాయ్‌ (థాయ్‌‌లాండ్‌‌)పై గెలిచి రెండో రౌండ్‌‌లోకి అడుగుపెట్టారు.

ఇతర మ్యాచ్‌‌ల్లో రక్షిత శ్రీ, సంతోష్‌‌ రామ్‌‌రాజ్‌‌, అనుపమ ఉపాధ్యాయ తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడారు. విమెన్స్‌‌ డబుల్స్‌‌లో ట్రీసా జోలీ– పుల్లెల గాయత్రి 21–15, 21–13తో ఆంగ్‌‌ జె– సి టింగ్‌‌ (మలేసియా)పై గెలిచి ముందంజ వేశారు. మరో మ్యాచ్‌‌లో కృష్ణమూర్తి రాయ్‌‌–ప్రతీక్‌‌ జోడీ  తొలి రౌండ్‌‌ను అధిగమించలేకపోయింది.