
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌కు అవకాశం
బ్యాంకాక్: ఒక్క రోజు.. జస్ట్ ఒకే ఒక్క రోజు ప్రధానిగా వ్యవహరించారు థాయ్‌లాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సూరియా జంగ్రుంగ్రియాంగ్‌కిట్. ప్రస్తుత ప్రధాని పెటోంగ్‌టర్న్ షినవత్రను సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలివ్వడంతో.. ఒక్కరోజు ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఆయనకు దక్కింది. ప్రధాని హోదా లో బుధవారం బ్యాంకాక్‌లో జరిగిన పీఎంవో 93వ వార్షికోత్సవంలో సూరియా పాల్గొన్నారు.
షినవత్రను సస్పెండ్ చేస్తూ కోర్టు మంగళవారం ఆదేశాలు ఇవ్వడంతో కేబినెట్‌లో మార్పులు చేస్తామని అధికార పార్టీ అదే రోజు రాత్రి ప్రకటించింది. పుంథం వేచాయచాయ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని, ఆయనే యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది.
అప్పటి వరకు ప్రస్తుత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సూరియా ప్రభుత్వాన్ని నడిపిస్తారని తెలిపింది. గురువారం కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఉంటుందని వెల్లడించింది.