11 మరణాలు.. ఎన్నో అనుమానాలు.. ఆసక్తిరేపుతున్న ఆఖరి సచ్ ట్రైలర్

11 మరణాలు.. ఎన్నో అనుమానాలు.. ఆసక్తిరేపుతున్న ఆఖరి సచ్ ట్రైలర్

ఇంతకాలం తన గ్లామర్ తో ఆడియన్స్ ను కట్టిపడేసిన తమన్నా(Thamannaah).. కెరీర్ లో మొదటిసారి క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ఆఖరి సచ్(Aakhri Sach). వాస్తవ ఘటనల ఆధారంగా వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ ను ఆగస్టు 25న నుండి హాట్ స్టార్(Hotstar) లో స్ట్రీమింగ్ కానుంది. తాజగా ఈ సిరీస్ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

2018లో దేశ రాజధాని న్యూఢిల్లీ బురారీ ప్రాంతంలో జరిగిన 11 మంది ఆత్మహత్యల చుట్టూ ఈ కథ తిరగనుంది. ఆసమయంలో ఈ ఘ‌ట‌న (Burari Deaths) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కథ ఆధారంగానే ఆఖరి సచ్ సిరీస్ ను తెరకెక్కస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా త‌మ‌న్నా క‌నిపించ‌నుంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 11 మరణాలు, ఎన్ని అనుమానాలు అంటూ ట్రైలర్ చూపించిన డైలాగ్ ఈ సిరీస్ పై ఆసక్తిని పెంచింది. 

నిర్వికార్ ఫిల్మ్స్(Nirvikal films) నిర్మిస్తున్నా ఆఖరి సచ్ వెబ్ సిరీస్‌ను దర్శకుడు రాబీ గ్రేవెల్(Roby grevel) తెరకెక్కిస్తున్నారు. తమన్నాతో పాటు.. అభిషేక్ బెనర్జీ, దనిష్ ఇక్బాల్, శివిన్ నారంగ్, నిషూ దీక్షిత్, క్రితి విజ్, సంజీవ్ చోప్రా, శివిన్ నారంగ్ త‌దిత‌రులు  ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు.