విజయ్ ఒక ఊసరవెల్లి.. ఫస్ట్ డే షూట్ క్యాన్సిల్

విజయ్ ఒక ఊసరవెల్లి.. ఫస్ట్ డే షూట్ క్యాన్సిల్

మిల్కీ బ్యూటీ తమన్నా(Thamannaah) నటిస్తున్న లేటెస్ట్ హాట్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్2(Lust Stories2). రొమాంటిక్ అండ్ బోల్డ్ కంటెంట్ తో రానున్న ఈ సిరీస్.. జూన్ 29న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్ పనుల్లో ఫుల్ బీజాగా ఉన్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది తమన్నా. 

Also Read : ఆడిషన్స్కు అలా వెళితేనే అవకాశాలు : అర్చన గౌతమ్

ఈ ఇంటర్వ్యూలో సిరీస్ గురించి, తన ప్రియుడు విజయ్ వర్మ(Vijay varma) గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. "నేను ఈ సిరీస్ కోసం మొత్తం ఎనిమిది రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను. ఎందుకో ఈ సిరీస్ చాలా ఇబ్బందిగా అనిపించింది. మొదటి రోజు షూట్‌ క్యాన్సిల్ చేసినప్పుడు.. ఈ సిరీస్ పట్ల తాను భయంగా ఉన్నట్లు విజయ్ భావించాడు కానీ.. నేను ఓ టాలెంటెడ్ యాక్టర్ తో పనిచేసే అవకాశం వచ్చిందని అనుకున్నాను. అంతే కాదు విజయ్ ఓ ఊసరవెల్లి లాంటి వాడు. పాత్ర కోసం ఎలాగైనా మారిపోతాడు. నేను అతని గత సినిమాలు కూడా చూశాను" అంటూ నవ్వుతూ ప్రియుడిపై పొగడ్తల వర్షం కురిపించింది తమన్నా. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.