
నేచురల్ స్టార్ హీరోగా, నజ్రియా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'అంటే సుందరానికీ' సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ను అభిమానులను అందించాలనే ఉద్దేశంతో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. కాగా ఇటీవలే ఓ ట్రైలర్ రిలీజై.. అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ కూడా వచ్చింది. ఈ మూవీలోని 'తందనానంద' అనే సాంగ్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. వెడ్డింగ్ థీమ్ లో వచ్చిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తూ అందర్నీ అలరిస్తోంది. శ్యామ్ సింగరాయ్ మూవీతో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన నాని... ఇప్పుడు మరో సారి ట్రెండింగ్ లో నిలుస్తారని ఆయన అభిమానులు జూన్ 10న విడుదల కాబోయే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.