'థ్యాంక్ గాడ్'లో అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్

'థ్యాంక్ గాడ్'లో అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నెక్స్ట్ కామెడీ చిత్రం 'థాంక్ గాడ్' కు సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీకి చెందిన ఓ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను మూవీ మేకర్స్ ఆవిష్కరించారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నాడు. "ఈ దీపావళికి, చిత్రగుప్త్ మీతో,  మీ కుటుంబంతో జీవితాన్ని ఒక ఆట ఆడటానికి వస్తున్నాడు! #ThankGod ట్రైలర్ రేపు విడుదలవుతుందని అజయ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను షేర్ చేశారు. అంతే కాకుండా అక్టోబర్ 25న ఈ సినిమా విడుదల కానుందనే క్యాప్షన్ జత చేశాడు.

ఈ గోల్‌మాల్' నటుడు అజయ్ దేవగన్'థ్యాంక్ గాడ్'లో చిత్రగుప్తుడి పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్ర బృందం రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో అజయ్ భారీ గడ్డం, కూల్ సన్ గ్లాసెస్‌తో, బ్లాక్ సూట్‌లో సింహాసనంపై కూర్చొని, డాపర్ లుక్‌లో కనిపిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో అజయ్‌తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ సైతం పలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'ధమాల్' దర్శకుడు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ దీపావళికి థియేటర్లలో విడుదల కానుందనే విషయాన్ని కూడా మూవీ మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో పాటు ఈ చిత్ర ట్రైలర్‌ను సెప్టెంబర్ 9, 2022న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)