
ప్రాణాలు తీస్తు న్న సెల్‌ఫోన్ .. అనే వార్తలే ఇప్పటివరకు చదివాం కదా..! కానీ ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి ప్రాణాల్ని కాపాడింది సెల్‌ఫోన్ . ఎమర్జెన్సీ సమయంలో ఎవరికైనా కాల్ చేయడానికో, మెసేజ్ పంపడానికో పని కొచ్చి ఉంటుం దిలే అని కొట్టి పారేయకండి..దూసుకొచ్చే బాణం నుంచి యజమానిని కాపాడింది. విషయానికొస్తే .. ఓ 43 ఏళ్ల ఆస్ట్రేలియన్ కారు తీసుకుని బయటకెళ్లాడు. కాస్త సేద తీరే మూడ్‌లో ఉండి కారాపి దిగాడు. అక్కడికి దగ్గ ర్లోనే తనకు తెలిసిన ఓ వ్యక్తి విల్లు పట్టుకుని ఉన్నాడు. చూస్తుండగానే సదరు వ్యక్తి విల్లును కారు నుంచి దిగిన వ్యక్తిపైకి గురి పెట్టాడు. బెంబేలెత్తిన అతను వెంటనే ఫోన్ తీసి విల్లు ఎక్కుపెట్టిన వాడి ఫొటో తీయబోయాడు. ఆ లోపే బాణం దూసుకొచ్చి సెల్‌ఫోన్ లోకి దిగబడింది. కాస్త అటూ ఇటూ అయితే వ్యక్తికి తగిలేదే. దవడ కింద చిన్న గాయమైందంతే. చదివారుగా ఓ వ్యక్తి ప్రాణాల్ని ఫోన్ ఎలా కాపాడిం దో. అన్నట్టు బాణం వేసిన వ్యక్తి పోలీసు ల అదుపులో ఉన్నాడు. బాణం గుచ్చుకున్న ఫోన్ ఫొటోను పోలీసులు ఫేస్‌బుక్‌లో పెట్టారు. అది కాస్తా వైరల్ అయింది.