ఘనంగా లోక్ సత్తా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా లోక్ సత్తా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

మేడ్చల్ మల్కాజిగిరి: లోక్ సత్తా పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని మల్కాజిగిరి పద్మావతి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ముందు జయప్రకాష్ నారాయణ గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటి రాజకీయ పరిస్థితులు, ప్రజలకు ఏ విధమైన సేవలు అందించాలనే విషయంపై  పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు  ఆయన చెప్పారు

సమాజంలో మార్పు తీసుకురావడానికి 16 ఏళ్ల కిందట  లోక్ సత్తా పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగానే ఓట్లు వేస్తున్నారని, కానీ ఓట్లను అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యంపై ప్రభుత్వాలు ఖర్చు పెట్టడంలేదన్నారు. చట్టం ఉన్నోడి చుట్టంలా మారిందని, పేదోడికి న్యాయం దొకట్లేదని చెప్పారు. అధికార వికేంద్రికరణ జరగాలని తెలిపారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు.