కోకిల రాగాలూ : నల్లమలలో పక్షుల సర్వే.. 150 జాతులు ఉన్నట్లు ప్రాథమిక గుర్తింపు

కోకిల రాగాలూ : నల్లమలలో పక్షుల సర్వే.. 150 జాతులు ఉన్నట్లు ప్రాథమిక గుర్తింపు

చుట్టూ దట్టమైన అడవి.. ప్రకృతి అందాలు ఓ వైపు కనువిందు చేస్తుంటే.. మరోవైపు పక్షుల కిలకిలలు పక్షి ప్రేమికులు, పరిశోధకులను పలుకరించాయి.ఆంధ్రప్రదేశ్ నల్లమల అడవిలో రెండు రోజుల పాటు పక్షి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ బర్డ్ సర్వేలో  150 రకాల జాతులను గుర్తించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్..  భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్  ఫారెస్ట్ ప్రాంతం  అనేక వన్యప్రాణుల జాతులకు, అనేక రకాల పక్షి జాతులకు  నిలయంగా ఉందని నంద్యాల జిల్లా అటవీశాఖాధికారులు వినీత్ కుమార్, రూపక్ యాదవ్ లు తెలిపారు. 

నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఫస్ట్ బర్డ్ సర్వే నేచర్ వాక్ కార్యక్రమం అక్టోబర్, 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు నల్లమల జంగిల్ క్యాంప్, ఎకో టూరిజం పాచెర్ల వద్ద  అటవీ అధికారులు నిర్వహించారు. రెండు సెషన్ లలో 150 రకాల పక్షి జాతులను గుర్తించామని DFO వినీత్ కుమార్ తెలిపారు.  భవిష్యత్తులో ఇలాంటి సర్వేలు కొనసాగిస్తామని తెలిపారు. నల్లమల అడవుల్లో  ప్రజల భాగస్వామ్యంతో జరిగిన ఇది మొదటి పక్షుల సర్వే అని  కో ఆర్డినేటర్ రూపక్ తెలిపారు.  దసరా తరువాత మరిన్ని కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈసర్వే ద్వారా ప్రజలకు అడవిలో నివపించే వన్యప్రాణుల వివరాలు.. పక్షి జాతుల గురించి తెలుస్తుందని కో ఆర్డినేటర్ చెప్పారు.

దేశంలో వివిధ రాష్ర్టాలు.. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నల్లమల అడవిలో   అటవీ అధికారులు , పక్షి ప్రేమికులు దాదాపు 50 మంది పక్షి సర్వేలో పాల్గొన్నారు. శ్రీశైలం పలు ప్రాంతాల్లో వివిధ జాతుల పక్షులు .. ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉదయం, సాయంత్రం వేళ అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పక్షి సర్వేకు విశేష స్పందన లభించింది.  ఈ ప్రాంతంలో తొలిసారి రెండు రోజుల పాటు   పక్షి సర్వే నిర్వహించారు.  ఈ సర్వేలో 150 రకాల  జాతుల పక్షులను గుర్తించినట్లు తమ అధ్యయనంలో తేలిందని  అటవీ శాఖాధికారులు తెలిపారు.  ఈ ప్రాంతంలో పదకొండు జాతుల గుడ్లగూబల శబ్దాలు.. కోకిల రాగాలు.. ఇంకా పలు రకాల పక్షి జాతుల అరపులను  గుర్తించామన్నారు.  చాలా రకాల  పక్షి జాతులు గూడు కట్టు కోవడం...  ఆహారం కోసం ...వాటి కార్యకలాపాల కోసం ఒకటి కంటే ఎక్కువ నివాసాలను ఉపయోగిస్తాయని తమ సర్వేలో గుర్తించినట్లు పక్షి ప్రేమికులు తెలిపారు.  

తరచుగా కనిపించే పక్షి కుటుంబాలు .. ఉప కుటుంబాలు పైక్నోనోటిడే (బుల్బుల్స్), సిల్వినే (వార్బ్లెర్స్), మస్కికాపిడే (ఫ్లైక్యాచర్స్) మరియు టర్డినే (బాబ్లర్లు), స్పెక్లెడ్ ​​పికులెట్ పికుమ్నస్ ఇన్నోమినాటస్ , రూఫస్ వడ్రంగిపిట్ట సెలియస్ బ్రాచ్యూరస్ , బ్రౌన్-హెడ్ బార్బెట్ మెగాలైమా జైలానికా , కామన్ హూపో ఉపుపా ఎపాప్స్ , ప్లెయిన్ ప్రినియా ప్రినియా ఇన్నోర్నాటా మరియు వైట్- రంప్డ్ షామా కాప్సైకస్ మలబార్‌నెస్టింగ్ అడవుల్లో సాధారణంగా ఉండే సుమారు 150 రకాలు పక్షి జాతులు కనిపించాయి.  ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అటవీ అధికారి రూపక్ సహా, ఇతర అధికారులను నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి (    Forest Range Officer)  ఈశ్వరయ్య, సెక్షన్ అధికారి  (Section officer) ఎల్లమ్మ, ఫారెస్ట్ బీట్ అధికారి  ( Forest beat officets) అర్షద్, రామారావు, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పక్షి  సర్వేలో పాల్గొన్న వారికి నంద్యాల ఎంపీ ప్రోగ్రాం ముగింపు సభలో  ప్రశంశా పత్రాలు అందించారు.