సంపాదించడంలో పోటీ : కరోనా క్రైసిస్ లో లక్షలకోట్లు సంపాదించిన భారతీయులు

సంపాదించడంలో పోటీ : కరోనా క్రైసిస్ లో లక్షలకోట్లు సంపాదించిన భారతీయులు

కరోనా పేదల్ని మరింత పేదవాళ్లుగా..ధనికులు మరింత ధనవంతులుగా మార్చేసిందని ప్రముఖ బిజినెస్ రీసెర్చ్  సంస్థ బ్లూం బెర్గ్ తెలిపింది.

బ్లూం బెర్గ్ తెలిపిన వివరాల ప్రకారం కరోనా క్రైసిస్ లో ఏడుగురు భారతీయులు బిలీనియర్ల స్థానంలో పోటీ పడినట్లు తెలిపింది. కరోనా కారణంగా ఆర్ధిక మాంద్యం అస్తవ్యస్తమైన ఈ ఏడుగురి ధనవంతుల కంపెనీల షేర్లు భారీ లాభాల్ని గడించినట్లు తన కథనంలో పేర్కొంది.

బ్లూమ్ బెర్గ్ బిలినియర్ ఇండెక్స్ జాబితాలో ఏడుగురు భారతీయుల ఆస్తులు ఈ ఏడాది 50శాతం పెరిగినట్లు చెప్పిన సదరు సంస్థ.. ఒక బిలియన్ అంటే రూ.7,300 కోట్లకు పైన. ఏడుగురి కుబేరుల సంపద 64 బిలియన్ డాలర్లు పెరిగింది అంటే దాదాపు 4.7 లక్షల కోట్లకు పైన పెరిగినట్లు నిర్ధారించింది.

 2020లో గౌతమ్ అదానీ సంపద అందరికంటే ఎక్కువగా పెరిగింది. 2019 చివరి నాటికి 11.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద ఇప్పుడు 21.1 బిలియన్ డాలర్లు పెరిగి, 32.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. అందుకు కారణంగా  అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ 525 శాతం జంప్ చేయడమేనని తెలుస్తోంది. అదానీ గ్రీన్ మార్కెట్ క్యాప్ రూ.1.63 లక్షల కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 31, 2019 నుండి ఇప్పటి వరకు రూ.26,040 కోట్లు పెరిగింది.

ముఖేష్ అంబానీ సంపద 18.1 బిలియన్ డాలర్లు పెరిగి గత ఏడాది 58.6 బిలియన్ డాలర్ల నుండి 76.7 బిలియన్ డాలర్లకు పెరిగింది.

 సైరస్ పూనావాలా ఆస్తులు 6.97 బిలియన్ డాలర్లు పెరిగి 15.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

 శివ్ నాడర్, అజీమ్ ప్రేమ్‌జీ సంపద ఇద్దరిదీ కలిసి 12 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇందులో శివ్ నాడర్ సంపద ఈ ఏడాది 6.29 బిలియన్ డాలర్లు పెరిగి 22 బిలియన్ డాలర్లకు, ప్రేమ్‌జీ ఆస్తి 5.26 బిలియన్ డాలర్లు పెరిగి 23.6 బిలియన్ డాలర్లుకు చేరుకుంది.

 డీమార్ట్ అధినేత రాధాకిషన్ ధమానీ సంపద 4.71 బిలియన్ డాలర్లు పెరిగి 14. బిలియన్ డాలర్లకు, దిలీప్ సింఘ్వీ ఆస్తి 2.23 బిలియన్ డాలర్లు పెరిగి 9.69 బిలియన్ డాలర్లకు చేరుకుంది.