ఐసీసీ ర్యాంకింగ్స్: టీ20ల్లో టాప్ ప్లేస్ లోకి భారత్..!

ఐసీసీ ర్యాంకింగ్స్: టీ20ల్లో టాప్ ప్లేస్ లోకి భారత్..!

ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్ లో భారత్ సత్తా చాటింది. టీ20ల్లో భారత్ 270 పాయింట్లతో మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచింది. 265 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలవగా..261 పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో, 253 పాయింట్లతో దక్షిణాఫ్రికా 4వ స్థానంలో.. 251పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో నిలిచాయి. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా నెంబర్ వన్ జట్టుగా నిలవగా.. భారత్ రెండోస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. ..వన్డేల్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా..ఇంగ్లాండ్ రెండోస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడోస్థానంలో నిలిచింది. భారత్ నాలుగోస్థానం దక్కగా.. పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచింది. 

టెస్టుల్లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య వ్యత్యాసం రెండు పాయింట్లే ఉండేది. అయితే, జనవరిలో జరిగిన యాషెస్ సిరీస్​లో ఇంగ్లాండ్​పై 4-0తో గెలవడం వల్ల.. ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లింది. పాకిస్థాన్... ఇంగ్లాండ్​ను అధిగమించి ఐదో స్థానానికి చేరింది. మే 4 వరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచ్​లను ర్యాంకింగ్స్ కోసం పరిగణలోకి తీసుకుంది ఐసీసీ. 2021లో ఇంగ్లాండ్- ఇండియా సిరీస్​లో భాగంగా వాయిదా పడిన చివరి టెస్టు ఫలితాన్ని సైతం ర్యాంకింగ్స్ కోసం పరిగణలోకి తీసుకోనున్నారు.