
అమ్మ బంగారు కొండ బతికాడు. నెలలు నిండకుండానే భూమ్మీదొకొచ్చి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. బ్రెయిన్ బ్లీడ్స్, శ్వాస, కంటిసమస్యలు ఇబ్బందిపెట్టా యి. ఎట్టకేలకు వాటిని జయించాడు. ఈ తొమ్మిది నెలలూ అమ్మ వాడి కోసం పరితపించింది. బతికే అవకాశాలు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. బతుకుతాడో లేదో తెలీని ఎన్నో సందర్భాల్లో ఆమె గుండె నిబ్బరంతో దేవుడిని ప్రార్థించింది. కేవలం 11 ఔన్సుల(311 గ్రాములు)తో పుట్టిన, వాడు నేడు 4.9 కేజీలు పెరిగాడు. దీంతో డాక్టర్లు శుక్రవారం వాడిని డిశ్చార్జ్ చేశారు. అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిందీ సంఘటన. 2018లో అకస్మాత్ గా నొప్పులు రావడంతో జానీ, భార్య జియో(27 వారాలు)ను హాస్పిటల్ లో చేర్పించాడు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో సిజేరియన్ చేసి బిడ్డను తీశారు. అప్పుడు వాడు ఉన్న బరువు, వాళ్ల అమ్మ గుండె బరువుతో సమానం. సరిగ్గా నాన్న అరచేతిలో సరిపోయాడు. డాక్టర్ల సూచనలతో తల్లిదండ్రులు నెలల తరబడి ఆస్పత్రిలోనే గడిపారు. వాడికి ‘ఫ్లోరియో’ అని పేరు పెట్టుకున్నారు.