హైదరాబాదులో బస్సెక్కి.. అడ్రస్ మరచిండు

హైదరాబాదులో బస్సెక్కి.. అడ్రస్ మరచిండు
  • పోలీసుల సంరక్షణలో బాలుడు

అమనగల్లు, వెలుగు:  హైదరాబాద్‌‌‌‌లో బస్సెక్కిన ఓ బాలుడు అడ్రస్ మరిచిపోయాడు. కండక్టర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు సంరక్షణలోకి తీసుకున్నారు. ఎస్సై శివశంకర వరప్రసాద్ వివరాల ప్రకారం.. దాదాపు 11 ఏండ్ల వయస్సున్న బాలుడు శనివారం హైదరాబాద్‌‌‌‌లోని  సంతోశ్ నగర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో తలకొండపల్లి చౌదర్‌‌‌‌‌‌‌‌పల్లి నైట్ హాల్డ్‌‌‌‌ బస్సెక్కి ఆమనగల్లు టికెట్ తీసుకున్నాడు. ఆమనగల్లు వచ్చాక కండక్టర్ దిగాలని సూచించగా.. తాను లాచులూరు(కందుకూరు మండలం) వెళ్లాలని చెప్పాడు.  అది ఎప్పుడో దాటిపోయామని చెప్పగా.. బస్సెక్కిడికి వెళ్తే అక్కడికి వస్తానని సమాధానం ఇచ్చాడు. దీంతో  చౌదర్​పల్లి వెళ్లాక కండక్టర్ 100కు డయల్ చేశాడు. పోలీసులు వచ్చి బాలున్ని స్టేషన్‌‌‌‌కు తీసుకెళ్లారు.  తన పేరు షేక్​ ఇమ్రాన్​ , తండ్రి పేరు మహ్మద్​ అని చెపుతున్నాడని , ప్లేసు, ఫోన్​ నెంబర్​ వివరాలు సరిగ్గా చెప్పడం లేదని ఎస్సై తెలిపారు. సంబంధీకులు తలకొండ పల్లి పీఎస్‌‌‌‌లో సంప్రదించాలని సూచించారు.