
న్యూఢిల్లీ: ప్రొడక్టుల పనితీరుపై ఆన్లైన్ షాపింగ్ సైట్లలో వస్తున్న నకిలీ రివ్యూలను తొలగించడంపై కేంద్రం ఫోకస్ చేసింది. ఈ విషయమై చర్చించడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ)తో పాటు సంబంధిత కంపెనీలతో శుక్రవారం వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నది. ఇలాంటి రివ్యూలు కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయనే ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సమస్య పరిష్కారం కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను తయారు చేసేందుకే మీటింగ్ పెడుతున్నామని మంత్రిత్వశాఖ సెక్రెటరీ రోహిత్ కుమార్ సింగ్ అన్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టాటా సన్స్, రిలయన్స్ రిటైల్ వంటి ఈ–-కామర్స్ సంస్థలు, వినియోగదారుల ఫోరమ్‌లు, లా యూనివర్సిటీలు, న్యాయవాదులు, ఫిక్కీ, సిఐఐ, వినియోగదారుల హక్కుల కార్యకర్తలకు లెటర్లు రాశారు. 223 ప్రధాన వెబ్‌సైట్‌లలో వచ్చిన రివ్యూలను ఫ్లాగ్ చేశారు. వీటిలో 55 శాతం రివ్యూలు రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల కస్టమర్లకు తప్పుడు సమాచారం వెళ్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారా..? చలాన్ కట్టేందుకు ఆఫర్