మంకీపాక్స్​కూ కరోనా జాగ్రత్తలే

మంకీపాక్స్​కూ కరోనా జాగ్రత్తలే

మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలంటూ కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. ‘‘మంకీపాక్స్ నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. అందుకు ఏం చేయాలో? ఏం చేయకూడదో? తెలుసుకుందాం” అని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ట్విట్టర్​లో వెల్లడించింది. అలాగే దేశంలో మంకీపాక్స్ పరిస్థితిపై మానిటర్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మంకీపాక్స్​కూ కరోనా జాగ్రత్తలే తీసుకోవాలని సూచించింది. దేశంలో ఇప్పటి వరకు 8 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

గైడ్​లైన్స్​ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం 
న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ గైడ్ లైన్స్ విడుదల చేసింది. ‘‘మంకీపాక్స్ నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. అందుకు ఏం చేయాలో? ఏం చేయకూడదో? తెలుసుకుందాం” అని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ట్విట్టర్​లో వెల్లడించింది. అలాగే దేశంలో మంకీపాక్స్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వ్యాధి వ్యాప్తి నివారణకు కల్పించాల్సిన మెడికల్ సౌలతులు, వ్యాక్సినేషన్​కు సంబంధించి ఈ కమిటీ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందజేస్తుందని చెప్పింది. కాగా, దేశంలో ఇప్పటి వరకు 8 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళలో 5, ఢిల్లీలో 3 ఉన్నాయి. కేరళలో మంకీపాక్స్​తో ఒకరు చనిపోయారు. 


ఇవి చేయొద్దు.. 

  • మంకీపాక్స్ సోకిన వ్యక్తి పడుకున్న మంచంలో గానీ, బెడ్​లో గానీ పడుకోవద్దు. బాధితులు వాడిన బట్టలు, టవల్స్ తదితర వస్తువులను వినియోగించొద్దు.  
  • బాధితుల బట్టలను ప్రత్యేకంగా ఉతకాలి. ఇతరుల బట్టలతో కలిపి ఉతకొద్దు. 
  • ఒకవేళ వ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే పబ్లిక్ ప్లేసులలోకి, ఈవెంట్స్ కి వెళ్లకూడదు. వ్యాధి సోకినోళ్లపై వివక్ష చూపొద్దు. 

ఇవి చేయాలి.. 

  • వ్యాధి సోకిన వ్యక్తిని ఐసోలేషన్​లో ఉంచాలి. అప్పుడే వ్యాధి వ్యాప్తి చెందదు.
  • పేషెంట్​కు దగ్గరగా వెళ్లే బంధువులు మూతికి మాస్కు, చేతులకు గ్లౌవ్స్ పెట్టుకోవాలి. 
  • శానిటైజర్ లేదా సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. 
  • ఇంటి పరిసరాలను డిస్ ఇన్ఫెక్టెంట్స్​తో క్లీన్ చేసుకోవాలి.