వీధి కుక్కల నియంత్రణపై కేంద్రం గైడ్ లైన్స్

వీధి కుక్కల నియంత్రణపై కేంద్రం గైడ్ లైన్స్

వీధి కుక్కల  నియంత్రణ పై కేంద్ర  ప్రభుత్వం  గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయన్న కేంద్రం  మూడు ప్రధాన అంశాలపై గెజిట్ రిలీజ్ చేసింది. వీధికుక్కలపై మున్సిపల్ సిబ్బంది, వెటర్నరీ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.  సర్టిఫైడ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో కుక్కలకు  ఆపరేషన్ తో పాటు   కుక్కల అబ్జర్వేషన్ కోసం ప్రత్యేక కెనాల్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. వాటన్నింటిని సీసీ కెమెరాల్లో రికార్డ్ చేయాలని  ఆదేశించింది.

కుక్కల దాడికి గురైన వారిని పది రోజుల పాటు అబ్జర్వేషన్ లో పెట్టాలని సూచించింది. కరిచిన కుక్కుకు రెబీస్ ఉందా లేదా అని టెస్టు చేయాలని ఆదేశించింది.  గత రూల్స్  ను మున్సిపాలిటీలు, అధికారులు  పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్రం. రూల్స్ పాటించకపోయినా.. కుక్కలు దాడి చేసినా దానికి మున్సిపల్ అధికారులదేనని హెచ్చరించింది. 

ఇటీవల దేశ వ్యాప్తంగా కుక్కల దాడులు ఆందోళన కరంగా మారాయి. హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఓ బాలుడు చనిపోవడం కలకలం రేపింది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడి ఘటనలు పెరిగిపోయాయి.  దీనిపైన ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల ద