దిక్కుతోచని టీ ఇండస్ట్రీ...సాయం కోసం ఎదురుచూపు

దిక్కుతోచని టీ ఇండస్ట్రీ...సాయం కోసం ఎదురుచూపు

చాయ్​ తాగితే మనకు జోష్​వస్తుంది. అయితే టీ ఇండస్ట్రీలో మాత్రం జోష్​ కనిపించడం లేదు. 
టీ ప్రొడక్టులకు గిరాకీ, ధర పడిపోయింది. ఇన్​పుట్​ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదు. వీటిన్నింటికి ఇప్పుడు వాతావరణ మార్పులు తోడయ్యాయి.పటిష్ట చర్యలు తీసుకోకుంటే ఈ పరిశ్రమ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.  

న్యూఢిల్లీ: డార్జిలింగ్‌‌‌‌‌‌‌‌లోని  దాదాపు సగం టీ ఎస్టేట్ల (దాదాపు 35-–40 వరకు) ముందు ఇప్పుడు ‘ఫర్​ సేల్’ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్లాంటర్లు కార్యకలాపాలు నిర్వహించలేకపోవడంతో గత సంవత్సరమే ఇవి అమ్మకానికి వచ్చాయి. స్థానిక రియల్ ఎస్టేట్ సంస్థలు తేయాకు ఎస్టేట్‌‌‌‌‌‌‌‌లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నాయి. వీళ్లు 15 శాతం ఎస్టేట్ భూమిని రిసార్ట్‌‌‌‌‌‌‌‌లుగా మార్చి,  టీ టూరిజం ప్రారంభిస్తారని అంచనా. యూరప్​లో మాంద్యం కారణంగా డార్జిలింగ్ టీకి కొనుగోలుదారులు తగ్గారు. మరొక ప్రధాన దిగుమతిదారు అయిన జపాన్, 2017 నుంచి డార్జిలింగ్ చాయ్​పత్తి కొనుగోళ్లను తగ్గించింది. ఈ కొండ ప్రాంతాల్లో ఆందోళనల వల్ల నాలుగు నెలల పాటు ఎస్టేట్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. సరఫరా సమస్యలు ఉండటంతో జపాన్ నుంచి కొనుగోలుదారులు తక్కువగా ఉంటున్నారు. జల్పాయిగురి జిల్లా డోయర్స్‌‌‌‌‌‌‌‌లోని ఒక టీ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ను గత నెల యాజమాన్యం వదిలేయడంతో 1,200 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. తెల్లవారి లేచి చూసేసరికి మేనేజర్, సిబ్బంది అంతా ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ నుంచి పారిపోయారు. కొన్నేళ్లుగా తోట నాసిరకంగా ఉండడంతో అమ్మకాలు లేక యాజమాన్యం జీతాలు కూడా ఇవ్వలేదు.  త్రిపురలోనూ ఇదే రకం పరిస్థితులు ఉన్నాయి.  ఆ రాష్ట్రంలోని అతిపెద్ద తేయాకు తోట, మూర్తి చెర్రా టీ ఎస్టేట్ జీతాలు చెల్లించడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. చైనా తరువాత అతిపెద్ద టీ ఉత్పత్తిదారు మనదేశమే! భారతదేశంలో  80 శాతం టీని ఉత్పత్తి చేసే పశ్చిమ బెంగాల్  ఈశాన్య ప్రాంతంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పటిష్ట చర్యలు తీసుకోకుంటే పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ధర, డిమాండ్, ఉత్పత్తికి సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. ఎగుమతులు తగ్గాయి. ఇప్పుడు వాతావరణ మార్పుల నుంచి ఇది సవాళ్లను ఎదుర్కొంటున్నది. 

తగ్గుతున్న డిమాండ్

ఈ పరిశ్రమ అంతర్జాతీయ,  దేశీయ మార్కెట్లలో డిమాండ్​ సమస్యను ఎదుర్కొంటోంది. గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో టీ అధికంగా సరఫరా కావడం,  వినియోగదారుల ప్రాధాన్యతలు మారడం వంటి అంశాలు టీకి డిమాండ్ తగ్గడానికి కారణమవుతున్నాయి. ఈ సమస్య పరిష్కరారం కావాలంటే తేయాకు పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్లను సృష్టించాలి. అందుకు సరైన బ్రాండింగ్,  మార్కెటింగ్   కావాలి. టీకి ప్రాధాన్యత తగ్గుతుండగా,  కాఫీ గ్లోబల్ డ్రింక్‌‌‌‌‌‌‌‌గా మారింది. ప్రత్యేకమైన టీలను ప్రోత్సహించే వినూత్న ప్రచారాలు,  టీ వినియోగాన్ని పెంచే టీ లాంజ్‌‌‌‌‌‌‌‌లలో,  బోటిక్‌‌‌‌‌‌‌‌లలో పెట్టుబడి పెట్టడం అవసరం. భారతదేశం ఏటా దాదాపు 1,400 మిలియన్ కిలోల టీని ఉత్పత్తి చేస్తుంది, అందులో 20 శాతం కంటే తక్కువ ఎగుమతి అవుతోంది. 2022లో దాదాపు 220 మిలియన్ కిలోల టీ ఎగుమతి అయింది. 2022 ఎగుమతులు 2016లో మాదిరిగానే ఉన్నాయి.  

2016 తర్వాతి మూడు సంవత్సరాల్లో అవి చాలా తక్కువగా ఉన్నాయి. చైనా, కెన్యా  శ్రీలంక తర్వాత టీని ఎగుమతి చేసే నాలుగో అతిపెద్ద దేశం ఇండియానే!  రష్యా, ఉక్రెయిన్,  కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో సహా సీఐఎస్​ దేశాలు భారతీయ టీని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. యూఏఈ రెండవ అతిపెద్ద దిగుమతిదారు.  ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్‌‌‌‌‌‌‌‌ మన టీని కొనలేకపోతోంది. పశ్చిమ ఆసియా దేశాలకు షిప్​మెంట్లు పెరగడం లేదు. ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక టీ కంపెనీ మొత్తం బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో 60 శాతానికి పైగా జీతాలకే చెల్లించాలి.  వీటి ఖర్చు భరించలేకపోవడం వల్ల చాలా టీ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌లు దివాలా  తీస్తున్నాయి. గత మూడేళ్లుగా టీ ధరలు పెరగడం లేదు.   ప్రత్యక్ష ఎగుమతులను ప్రోత్సహించడం కోసం అస్సాం ఈ రంగానికి అనేక రకాల ఆర్థిక సహాయాన్ని ప్రతిపాదించింది.  టీ ప్రచారానికి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని కూడా  ప్రభుత్వం యోచిస్తోందని, ఈ పద్ధతిని ఇతర రాష్ట్రాలు అనుసరించాలని ఎక్స్​పర్టులు అంటున్నారు. గత ఏడాది టీ బోర్డు వచ్చే ఐదేళ్లకు కేంద్రం నుంచి రూ.వెయ్యి  కోట్ల సాయం కోరింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగినంతగా ధరలు లేకపోవడంతో తమకు ఆర్థిక సాయం తప్పనిసరని పేర్కొంది.  బొగ్గు, గ్యాస్,  సల్ఫర్ వంటి  ఖర్చులు ఏటా విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొంది. 

ఏం చేయాలో చెప్పండి..

అస్సాం,  పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని టీ ఉత్పత్తిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం ఒక పిలుపునిచ్చింది. టీకి గిరాకీ పెంచడానికి ఉత్పత్తిదారులు, పరిశ్రమల ప్రముఖులు, చిల్లర వ్యాపారులు, ప్రభుత్వ సంస్థలు  నిపుణులతో సహా వాటాదారులందరూ కలిసి మార్గాలు కనుగొనాలని సూచించింది. అస్సాం,  ఉత్తర బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని తేయాకు పరిశ్రమ వాతావరణ మార్పుల కారణంగా దెబ్బతింటోంది. అస్థిర వాతావరణ పరిస్థితులు, విపరీతమైన ఉష్ణోగ్రతలు,  తగినంత వర్షపాతం లేక టీ ఉత్పత్తి,  నాణ్యత.. రెండూ దెబ్బతింటున్నాయి. త్రిపురలో టీ ప్లాంటర్లు సుదీర్ఘ పొడి వాతావరణం కారణంగా ఉత్పత్తిలో కొరతను ఎదుర్కొన్నారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి దెబ్బతింది. ఆకుల కొరతతో వేలం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పరిమాణం కూడా పడిపోయింది.  ఇటువంటి పరిస్థితుల్లో లాభాలు రావడం కష్టమేనని త్రిపుర టీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సంతోష్ అన్నారు.  తేయాకు తోటలకు మంచి వాతావరణం కీలకం. వాతావరణ మార్పులు,  గ్లోబల్ వార్మింగ్ గత కొన్ని సంవత్సరాలుగా అస్సాంలోని తేయాకు తోటలకు నష్టం చేశాయి. సాగునీరు లేకుంటే తేయాకు తోటలు బతకడం కష్టమయ్యే పరిస్థితి ఉంది.  టెక్నాలజీ ఆధారిత నీటిపారుదల, ఫెర్టిగేషన్​ ( ఫలదీకరణం)పై నార్త్ ఈస్టర్న్ టీ అసోసియేషన్ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లను నిర్వహించింది. ఉత్తర పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో మొదటి ఉత్పత్తి ఈ సంవత్సరం దెబ్బతింది. ఉత్పత్తి  8–-10శాతం తగ్గుతుందని టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ ప్రబీర్ భట్టాచార్య గత నెలలో చెప్పారు. 
"రెండవ ఫ్లష్ సీజన్ ప్రారంభంలో వర్షం పడినప్పటికీ, పగలు,  రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడాల వల్ల నష్టం జరిగింది. కీటకాల దాడికి దారితీసింది. ఉత్పత్తిలో కొరత ఇటీవలి సంవత్సరాలలో అత్యధికంగా ఉంది”అని ఆయన అన్నారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల టీ వెరైటీలను అభివృద్ధి 
చేయడం అనేది ఒక పరిష్కార మార్గమని చెప్పారు.