స్కూల్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు : పిల్లలను కాపాడి ప్రాణాలు విడిచాడు

స్కూల్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు : పిల్లలను కాపాడి ప్రాణాలు విడిచాడు

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న పిల్లలు మొదులుకొని పెద్ద వయస్సు కలిగిన వారు గుండెపోటుతో మరణిస్తున్నారు.  

అప్పటివరకు బాగున్న మనుషులు ఎక్కడ చూసినా క్షణాల్లో కుప్పకూలడం, ఆపై ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కంటే చాలా ఎక్కువగా, సడన్ గా వస్తున్న గుండెపోటులపై ప్రతి ఒక్కరిలోనూ భయాందోళన కలుగుతోంది. 

Also Read :- క్యాన్సర్ వచ్చిందేమోనని భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఏపీలోని  బాపట్ల జిల్లా ఉప్పలపాడులో  స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తుండగా బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది.  వెంటనే డ్రైవర్ సమయాస్ఫూర్తితో బస్సును పక్కన ఆపి ప్రాణాలు విడిచాడు. ప్రాణాలు పోతున్నా పిల్లల్ని కాపాడి పెను ప్రమాదాన్ని తప్పించాడు.ప్రమాద సమయంలో మొత్తం 40  మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. తన ప్రాణాలతోపాటు బస్సులోని 40 మంది పిల్లల ప్రాణాలను ఆలోచించిన డ్రైవర్.. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి.. పిల్లలను కిందకు దింపేశాడు. ఆ తర్వాత డ్రైవింగ్ సీట్లోనే.. స్టీరింగ్ పైనే తలవాల్చి ప్రాణాలు విడిచాడు డ్రైవర్. దీంతో విద్యార్థులకు ముప్పు తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పిల్లల ప్రాణాలు కాపాడిన స్కూల్ బస్సు డ్రైవర్ ను తలచుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు పిల్లలు, స్కూల్ సిబ్బంది.