ఒక్కో పనికి.. ఒక్కో యాప్ .. స్మార్ట్ ​ఫోన్​లోనే ఎలక్షన్ కమిషన్ పూర్తి సేవలు

ఒక్కో పనికి.. ఒక్కో యాప్ .. స్మార్ట్ ​ఫోన్​లోనే ఎలక్షన్ కమిషన్ పూర్తి సేవలు
  • ఒక్కో పనికి.. ఒక్కో యాప్ .. స్మార్ట్ ​ఫోన్​లోనే ఎలక్షన్ కమిషన్ పూర్తి సేవలు
  • ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్
  • ఓటు నమోదు, బదిలీకి ఓటర్ హెల్ప్ లైన్’ 
  • 1950 నంబర్​తో స్పెషల్ హెల్ప్​లైన్ కాల్ సెంటర్

ఖమ్మం, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు ఎలక్షన్ కమిషన్ స్పెషల్ యాప్​లు తయారు చేసింది. ఒక్కో ఇన్ఫర్మేషన్ కోసం.. ఒక్కో యాప్​ను రూపొందించింది. దీంతో ఎన్నికల నిర్వహణ మరింత సులభం కానుంది. కొత్త ఓటర్ల నమోదు, ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్ స్టేషన్​కు ఓటు బదిలీ, ఓటర్ల వివరాలు, ప్రలోభాలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇలా ఎన్నికలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఇంట్లోనే కూర్చుని స్మార్ట్ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఫోన్ యాప్, వెబ్​సైట్ లేదా కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నది. కంప్లైంట్ చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ల వివరాలు గోప్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. పోలీసులకు, ఎన్నికల సర్వైలెన్స్ అధికారులకు, సాధారణ ప్రజలకు సమాచారం తెలిసేలా యాప్​లు తయారు చేసింది. టెక్నాలజీతో మనీ పవర్ కంట్రోల్ చేసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఓటర్ హెల్ప్ లైన్ యాప్

ఓటుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు, కొత్త వివరాల నమోదుకు, ఆధార్ అనుసంధానికి ‘ఓటర్ హెల్ప్​లైన్’ యాప్ ఉపయోగించుకోవచ్చు. మరికొన్ని ఆప్షన్లు కలిపి ఈసీ <https://voters.eci.gov.in>  వెబ్​సైట్​ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త అప్లికేషన్ ఫామ్ ట్రాకింగ్, ఓటర్ కార్డు డౌన్​లోడ్, ఎన్ఐఆర్ ఓటు రిజిస్ట్రేషన్ వంటివి ఈ వెబ్​సైట్​తో చేసుకోవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1950 ద్వారా నేషనల్ గ్రీవెన్సెస్ సర్వీస్ పోర్టల్ ను ఈసీ అందుబాటులోకి తెచ్చింది. 

100 నిమిషాల్లోనే యాక్షన్

ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులకైనా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో అందుబాటులో ఉంది. యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. వాటన్నింటికీ ఓకే చెప్పిన తర్వాత మీ ఫోన్​ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. లేదా మీ వివరాలు గోప్యంగా ఉంచాలనుకుంటే అనానిమస్​గా యాప్​లోకి ఎంటర్ అవ్వొచ్చు. ఆ తర్వాత కంప్లైంట్ చేయొచ్చు. ఫిర్యాదుకు సంబంధించిన వీడియో, ఫొటో, ఆడియోలు కూడా అప్​లోడ్  చేయొచ్చు. మీ ఫోన్​లోని జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది.

జియో ట్యాగింగ్, జియో లొకేషన్ ఆధారంగా కంప్లైంట్​పై దగ్గర్లోని ఎన్నికల అధికారులు స్పందిస్తారు. 50 నిమిషాల్లోపు కంప్లైంట్ వచ్చిన స్థలానికి చేరుకోవాలని, కంప్లైంట్ వచ్చిన 100 నిమిషాల్లోపు యాక్షన్​ తీసుకోవాలని రూల్స్ ఉన్నాయి. తగిన చర్య తీసుకోకుంటే.. సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకునేలా నిబంధనలున్నాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు.

కొత్త ఓటర్ల నమోదుకు లాస్ట్ చాన్స్​

ఈ ఏడాది అక్టోబర్ 1 వరకు 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్​ కమిషన్ లాస్ట్ చాన్స్ ఇచ్చింది. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది. అత్యధికంగా కొత్త ఓటర్ల నమోదులో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఏకంగా 44,204 మంది ఓటు నమోదు చేసుకున్నారు.