త్వరలో ఫైబర్ గ్రిడ్ పూర్తి చేస్తం : ఇక ఇంటింటికీ ఇంటర్నెట్

త్వరలో ఫైబర్ గ్రిడ్ పూర్తి చేస్తం : ఇక ఇంటింటికీ ఇంటర్నెట్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో త్వరలోనే ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. త్వరలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించిన తొలి రాష్ట్రంగా అవతరించబోతోందని తెలిపారు. శుక్రవారం  వరల్డ్‌‌ ఎకనామిక్‌‌ ఫోరం నిర్వహించిన వర్చువల్‌‌ సమ్మిట్‌‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫైబర్‌‌ గ్రిడ్‌‌ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కానుందని వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లోకి సైతం 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తుందన్నారు.

టెక్నాలజీ వాడకంతో ప్రజల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని కేటీఆర్ అన్నారు. అగ్రికల్చర్‌‌, హెల్త్‌‌కేర్‌‌, ఎడ్యుకేషన్‌‌ రంగాల్లో ఇన్నోవేషన్‌‌, ఎమర్జింగ్‌‌ టెక్నాలజీలను విస్తృతంగా వాడుతున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు ఉపయోగిస్తున్నామని, హెల్త్‌‌కేర్‌‌లో ‘మెడిసిన్‌‌ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టులు అమలవుతున్నాయని వివరించారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ మానవాళి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. వర్చువల్ సమ్మిట్ లో సికోయ క్యాపిటల్‌‌ ఎండీ రాజన్‌‌ ఆనందన్‌‌, బేర్‌‌ఫుట్‌‌ కాలేజీ డైరెక్టర్‌‌ మేఘన్‌‌ పల్లోన్‌‌, యూపీసీఎల్‌‌ సీఈవో జైశ్రాఫ్‌‌ పాల్గొన్నారు.