ప్రతి నెలా ఒకటో తారీఖునే పెన్షన్ ఇయ్యాలె

ప్రతి నెలా ఒకటో తారీఖునే పెన్షన్ ఇయ్యాలె

భద్రాద్రికొత్తగూడెం,వెలుగు: ప్రతి నెలా ఒకటో తారీఖునే పెన్షన్​ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్​పెన్షనర్స్​జాయింట్​యాక్షన్ కమిటీ(జేఏసీ) కోఆర్డినేటర్ ఎం.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ కలెక్టరేట్​ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. దీనిలో ఆయన మాట్లాడారు. నెలలో పెన్షన్ ​ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నామన్నారు. 

వచ్చే జులై నుంచి ఐఆర్ ​ప్రకటించాలన్నారు. కొత్త పెన్షన్​విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ ​విధానాన్నే కొనసాగించాలన్నారు. ప్రతి జిల్లాలో రెండు వెల్ నెస్​సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని డీఆర్​వో అశోక్ కుమార్​కు అందించారు. ప్రోగ్రాంలో లీడర్లు బి.వెంకటేశ్వరరావు, కె. వెంకటేశ్వరరావు, థామస్, ఉమామహేశ్వరరావు, పుల్లయ్య, సత్యనారాయణ, నాగరాజు, కోటమ్మ, మేరీ, సామ్యూల్​పాల్గొన్నారు.