పార్టీలో కాల్పులు.. నలుగురు మృతి

పార్టీలో కాల్పులు..  నలుగురు మృతి

బాల్టిమోర్ : అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఓ పార్టీలో దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందారు. 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ లో జరిగింది. ఇక్కడి బ్రూక్లిన్ హోమ్స్ ఏరియాలో ఏటా ‘బ్రూక్లిన్ డే’ జరుపుకుంటారు. ఈసారి శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఆ ఏరియాలోని వంద మందికి పైగా హాజరయ్యారు.

 అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో అందరూ ఎంజాయ్ చేస్తున్న టైమ్​లో ఓ దుండగుడు గన్​తో ఎంటరయ్యాడు. జనంపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. దాదాపు 30 రౌండ్లు ఫైరింగ్ చేశాడు. దీంతో నలుగురు చనిపోగా, 25 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.