కర్ఫ్యూ పై చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారా..?

కర్ఫ్యూ పై చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారా..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. గురువారంతో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ముగియనున్నందున తర్వాత చర్యలు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. దీంతో  రేపు పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు చెప్పింది సర్కార్. అయితే 
చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకన్న హైకోర్టు.. నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకని సీరియస్ అయ్యింది. కనీసం ఒక రోజు ముందు చెబితే నష్టమేంటని ప్రశ్నించింది. దీంతో బుధవారం మధ్యాహ్నంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు బదులిచ్చింది. నియంత్రణ చర్యలపై మేం ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదన్న హైకోర్టు.. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ప్రభుత్వాన్ని సంప్రదించి ఇవాళ మధ్యాహ్నంలోగా తదుపరి తీసుకునే చర్యలేంటో చెబుతానని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు.