సీఎంకు కరోనా వచ్చినా మీరు కదలరా..?

సీఎంకు కరోనా వచ్చినా మీరు కదలరా..?
  • సీఎంతోపాటు ప్రధాన అధికారులంతా కోవిడ్ బారిన పడినా సీరియస్ నెస్ కనిపించడంలేదు
  • క్లబ్బులు, బార్లు, సినిమా థియేటర్లు, ఎన్నికల ర్యాలీలు, సభల నియంత్రణ కనిపించడం లేదన్న హైకోర్టు
  • మొన్న ఆక్సిజన్ కొరతలేదని కోర్టుకు తెలిపారు... ఇప్పుడు మీడియాలో కొరత ఉందంటున్నారు.. ఏది నిజమని నమ్మాలి.. ?
  • రాష్ట్రంలో ఎన్ని 108 అంబులెన్సులు ఉన్నాయో చెప్పగలరా..?
  • కుంభమేళాకు వెళ్లొచ్చిన వారందరినీ ఇతర రాష్ట్రాల్లో క్వారెంటైన్ కు పంపారు..
  • మరి తెలంగాణలో ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదే..?
  • వలస కార్మికులకు నైట్ షెల్టర్లు ఏమైనా ఏర్పాటు చేశారా..?
  • ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్లు ఉన్నాయా..? 
  • వెబ్ పోర్టల్లో ఆసుపత్రుల్లో పడకల వివరాలు, ఆక్సిజన్ వివరాలు ఎందుకు పెట్టడం లేదు..?
  • ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం

హైదరాబాద్: కరోనా కట్టడి.. నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని ప్రధాన అధికారులు , ముఖ్యమంత్రితో సహా కోవిడ్ బారిన పడ్డా.. మల్టీప్లెక్స్, సినిమా థియేటర్స్, క్లబ్బులు, బార్లు, ఎన్నికల ర్యాలీలు, సభలను ఎందుకు నియంత్రించడం లేదన్న హైకోర్టు ప్రశ్నించింది. హెల్త్ మినిస్టర్ ఆక్సిజన్ కొరత ఉందని మీడియా ద్వారా చెపుతున్నాడు.. మొన్న కోర్టుకు చెప్పిన నివేదికలో రాష్ట అవసరాల కు కావాల్సిన ఆక్సిజన్ ఉందని చెప్పారు...ఇందులో ఎవ్వరిది నిజమని నమ్మలని హైకోర్టు నిలదీసింది. కుంభమేళాకు వెళ్లొచ్చిన వారినందరినీ అన్ని రాష్ట్రాలు క్వారెంటైన్ కు పంపిస్తున్నారు... మరి తెలంగాణలో ఇలాంటివి ఎక్కడా కనిపిచడం లేదే..? అసలు రాష్ట్రంలో ఎన్ని అంబులెన్సులున్నాయో చెప్పగలరా.. ? వలస కార్మికులకు నైట్ షల్టర్లు ఏమైనా ఏర్పాటు చేశారా..? ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్లు ఉన్నాయా ? అన్న హైకోర్టు ప్రశ్నల పరంపరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి నీళ్లు నమలాల్సి వచ్చింది. కరోనా ట్రీట్మెంట్ విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు దారుణంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలొస్తుండడాన్ని ప్రస్తావించిన హైకోర్టు వెబ్ పోర్టల్ లో ఆస్పత్రుల్లో పడకలు , ఆక్సిజన్ నిల్వల వంటి వాటి వివరాలు ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు నిలదీసింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూస్తుంటే.. ప్రభుత్వం ఎవరి మానాన వారిని గాలికొదిలేసి చేతులెత్తేసి చోద్యం చూస్తున్న చందంగా ఉందంటూ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం ఉదయం కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి హాజరై వివరణ ఇచ్చారు. ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ ను అమలు చేస్తోందని కోర్టుకు తెలిపారు ఏజీ. నైట్ కర్ఫ్యూ వలన కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గాయన్న ప్రభుత్వం వివరణపై హైకోర్టు మండిపడుతూ ఎక్కడ తగ్గయో చూపించాలన్న హైకోర్టు నిలదీసింది. నైట్ కర్ఫ్యూ విధిస్తే పగటిపూట బహిరంగ ప్రదేశాల్లో బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది.  కుంభమేళా కు వెళ్లి వచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు  క్వరంటయిన్ లో పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించిన హైకోర్టు. రాష్ట్రాల సరిహద్దులో ఎలాంటి చర్యలు చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ (RTPCR) టెస్ట్ రిపోర్ట్ ఎందుకు 24 గంటల్లోపు  ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. వీఐపీలకు మాత్రం 24 గంటల్లో ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టులు ఇస్తున్నారు..సామాన్యులకు ఇవ్వడం లేదే అని  హైకోర్టు నిలదీసింది. అలాగే ఇతర దేశాల నుండి, రాష్టాల నుండి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులు ఎందుకు అడగడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఏయే స్మశాన వాటికలో రోజుకు ఎంతెంత మందికి అంత్యక్రియలు జరుపుతున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రేమ్ డెసీవీర్ వ్యాక్సిన్ రాష్ట్రంలోనే తయారు అవుతున్నా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని  హైకోర్టు ప్రశ్నించింది. ఏప్రిల్ నెలలో  21 వేలు రెమ్ డెసివీర్ ఇంజక్షన్స్ కేటాయించారు.. ఇప్పుడు నాలుగు లక్షలు ఎందుకు డిమాండ్ చేశారని  హైకోర్టు ప్రశ్నించింది. ప్రతి హాస్పటల్లో నోటీసు బోర్డుల్లో డిస్ ప్లే ఎందుకు ఏర్పాటు చెయ్యడం లేదు, వెబ్ పోర్టల్ లో బెడ్స్, ఆక్సిజన్ వాటి వివరాలు ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారని హైకోర్టు ప్రశ్నించగా.. రాష్ట్రంలో 4700 మంది కోవిడ్ రోగులకు చికిత్స ఇచ్చే విధంగా అందుబాటులో ఉందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్ లు ఉన్నాయా ? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంతోమంది వలస కార్మికులు వెళ్తున్నారు.. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది.. వలస కార్మికులకు నైట్ షల్టర్లు ఏమైనా ఆర్రేంజ్ చేశారా ? అని హైకోర్టు ప్రశ్నించింది. అసలు రాష్ట్రంలో 108 అంబులెన్స్ లు ఎన్ని ఉన్నాయి..? 108 కాల్ సెంటర్స్ లో ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారు..? రోజూ ఎన్ని కాల్స్ రీసివ్ చేసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ ,సంగారెడ్డి, రంగారెడ్డి, మల్కాజిగిరి, మేడ్చల్ పరిధిలో ఎన్ని 108 లు అంబులెన్స్ లు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. హెల్త్ మినిస్టర్ ఆక్సిజన్ కొరత ఉందని మీడియా ద్వారా చెపుతున్నాడు.. గతంలో కోర్టుకు చెప్పిన నివేదికలో రాష్ట అవసరాల కు కావాల్సిన ఆక్సిజన్ ఉందని చెప్పారు కదా అని ప్రశ్నించిన హైకోర్టు ఇందులో ఎవ్వరిది నిజమని నమ్మాలని నిలదీసింది. రాష్టానికి కావాల్సిన ఆక్సిజన్  ప్రతి రోజు 384 టన్నుల గాను 270 టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలుపగా మూడు రోజుల్లోనే ఆక్సిజన్ నిల్వల కొరత ఎలా ఏర్పడిందని  హైకోర్టు ప్రశ్నించింది.  ప్రభుత్వం చెప్పిన వివరణ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. పూర్తి వివరాలు తెలపాలంటూ తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 వాయిదా వేసింది హైకోర్టు.